
రోడ్డు టెర్రర్ గా మారిన బైక్ రేసింగ్ పై రాయదుర్గం పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.హై సెక్యూరిటీ జోన్ ఐటి కారిడార్ లో బైక్ రేసర్లు రెచ్చిపోతున్నాడం పోలీసులకు సవాల్ గా మారింది. హైదరాబాదులోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వస్తున్న యువకులు రేసింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.శని ఆదివారాలలో రేసింగ్ అధికంగా జరుగుతున్నట్లు గుర్తించామని రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న చెప్పారు.గతంలో ఇదే వ్యవహారంలో పట్టుబడ్డ యువకులకు కౌన్సిలింగ్ నిర్వహించిన పరివర్తన రాకపోవడంతో మరోసారి పట్టుబట్ట యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.ఈ జూన్ నెలలోనే ఇప్పటివరకు 75 బైకులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ర్యాష్, నేగ్లిజెన్స్, ఓవర్ స్పీడ్ తో పాటు ఆర్టిఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయని, నెంబర్ ప్లేట్స్ లేకుండా,సైలెన్సర్ మార్చి వాహనాలు నడుపుతున్న యువకులపై కేసు నమోదు చేశారు. మెజిస్ట్రేట్ ముందు బైండ్ ఓవర్ చేసిన పోలీసులు లక్ష రూపాయలు పూచి కత్తితో విడుదల చేశారు. ఇంకోసారి పట్టుపడితే లక్ష రూపాయలు పరిహారంతో పాటు అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తామని చెప్పారు. అజాగ్రత్తగా నడిపి రోడ్డు ప్రమాదం కారణమైతే తీవ్రమైన సెక్షన్లు నమోదు చేస్తారు . రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైతే 304 పార్ట్2 కింద కేసు ఈ నమోదు అయితే మూడు నెలల వరకు బెయిల్ దొరికే అవకాశం లేదని కనీసం 10 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని చెప్పారు. బైక్ రేసింగ్ పాల్పడే యువకుల తల్లిదండ్రులకు పోలీసులు పలు సూచనలు చేశారు. బైక్ రేసింగ్ కు పాల్పడితే మీ పిల్లలు రోడ్డు ప్రమాదంలో మరణించే ప్రమాదం ఉన్నందున తగిన జాగ్రత్తలు చెప్పాలని కోరారు. బైక్ రైడింగ్ చట్ట విరుద్ధం..బైక్ రేసింగ్ పాల్పడితే తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్ రికార్డులకు ఎక్కితే జీవితం నాశనం అవుతుందని భవిష్యత్తు అందాకారమవుతుందని గ్రహించాలన్నారు. రేసింగ్ సరదా ఎదుటి వ్యక్తి మరణానికి కారకులవుతారని విచారం వ్యక్తంచేశారు. బైక్ స్టంట్,మితిమీరిన వేగంయో విలువైన ప్రాణాలు ప్రమాదంలో పడతాయని మీ మీద ఆధారపడ్డ కుటుంబ సభ్యులు రోడ్డున పడతారు అన్న విషయాన్ని గుర్తించాలన్నారు.
ఈ క్రింది లింకులు చదవండి
కన్న తండ్రే కామాందుడు ఫోర్న్ విడియోస్ చూస్తూ దుశ్చర్య
పబ్బుల్లో యువతలుతో వల … గలీజ్ దందాతో ధనార్జన
అమెజాన్ ఉద్యోగుల బకాయిల దారిమల్లింపు:వ్యక్తి అరెస్ట్
