
హైదరాబాద్ మాదాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. క్లౌడ్ 9 సర్వీస్ అపార్ట్మెంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగరాజు యాదవ్ బర్త్ డే వేడుకలు పేరుతో రేవ్ పార్టీ నిర్వహించారు. పక్క సమాచారంతో ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ టీం దాడులు నిర్వహించినట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ ఖురేషి తెలిపారు హై సెక్యూరిటీ జోన్లో సైబర్ టవర్స్ సమీపంలో అపార్ట్మెంట్ లో అద్దెకు తీసుకొని నిర్వహిస్తున్న రేవ్ పార్టీని చాకచక్యంగా భగ్నం చేశారు. గోవా వెళ్లిన నాగరాజు అక్కడ కొకైన్, ఎండిఎం కొనుగోలు చేశాడు.అతని సోదరుడు సాయి కుమార్ యాదవ్ దుబాయ్ లో ఫారెన్ లిక్కర్ కొనుగోలు చేసి బర్త్ డే వేడుకలకు సిద్ధం చేసాడు. ఈ వేడుకలకు14 మంది స్నేహితులు,కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆరుగురు యువతులు బర్తడే వేడుకలకు రప్పించారు.డ్రగ్స్,విదేశీ మద్యం తో మజా చేస్తున్న సమయంలో ఎక్సైజ్ పోలీసులు రంగ ప్రవేశం చేసి వారందరిని అదుపులోకి తీసుకున్నారు.ఈ రేవ్ పార్టీకి కీలకంగా వ్యవహరించిన ఇమాన్యుయల్, చట్టి కిషోర్, నితిన్ తో పాటు నాగరాజు, సాయికుమార్ లనుఅదుపులోకి తీసుకున్నారు…. మిగతా వారిని కౌన్సిలింగ్ నిర్వహించి ఇంటికి పంపించేశారు. డ్రగ్స్ సేవించిన వారినుంచి నమూనాలు స్వీకరించి పరీక్షలు నిర్వహించారు. సేవించినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేశారు.బర్తడే పార్టీ సందర్భంగా నిర్వహిస్తున్న రేవ్ పార్టీ…నిర్వాకుడు నాగరాజ్ యాదవ్ తో పాటు 15 మందిని అదుపులోకి తీసుకున్నారు.విదేశీ మద్యంతోపాటు ఒక గ్రాము కొకైన్ ఎండిఎంఏ. పాటు విదేశీ మధ్యము, 1 ఇనోవా కారు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ సయ్యద్ ఖురేషి తెలిపారు