నీట్ ఫలితాలపై విచారించే వరకు కౌన్సెలింగ్ నిర్వహించొద్దు

నీట్ ఎగ్జాం రద్దు చేయాలి
బేతాళ సుదర్శనం

నీట్-2023తో పోల్చితే అదే స్కోర్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ మూడు నుండి నాలుగు రెట్లు పెరిగింది, ఇది సమర్థనీయం కాదు. పరీక్షా ప్రక్రియ ఫలితాలను విచారించే వరకు కౌన్సెలింగ్ నిర్వహించరాదని సమత సైనిక్ దళ్ నాయకులు బేతాళ సుదర్శనం డిమాండ్ చేశారు.గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించాలి. గ్రేస్ మార్కులు ఇవ్వడానికి ఉపయోగించిన ఫార్ములా అన్యాయమైనది, నీట్ చరిత్రలో ఇంతవరకు జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు.తిరిగి పరీక్ష షెడ్యూల్ ప్రకటించాలి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ వెంటనే దర్యాప్తు చేయాలని సమతా సైనిక్ దళ్ డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.నీట్ అక్రమాలు బిజెపి ప్రభుత్వం ద్వారా నిరంతరాయంగా జరుగుతున్నాయని ఆరోపించారు.నీట్ పరీక్ష ఫలితాల్లో తమ రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరిగిందని మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపణ, నీట్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేసిన విషయం పరిగణలోకి తీసుకోవాలన్నారు.హర్యానాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురితో సహా రికార్డు స్థాయిలో 67 మంది అభ్యర్థులు టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్నారని మే 5న నిర్వహించిన NEET-UG అడ్మిషన్ లో ర్యాంకులు పొందారని ఆయన ఆరోపిస్తున్నారు.ఈ మొత్తం మార్కుల కుంభకోణం పైసుప్రీం కోర్ట్ పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.సీనియర్ న్యాయవాది సయ్యద్ ఒమర్,టీపీసీసీ వైస్‌ చైర్మన్‌, లీగల్‌, హ్యూమన్‌ రైట్స్‌, ఆర్‌టీఐ సెల్‌కు చెందిన సీనియర్‌ హెచ్‌సీ న్యాయవాది కంపల్లి ఉదయ్‌కాంత్‌ సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌కు నీట్‌-యూజీమెడికల్, డెంటల్ కోర్సులలో ప్రవేశ నిర్వహణలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలని ఫిర్యాదు చేశారని చెప్పారు. 67 మంది విద్యార్థులు 720/720 పర్ఫెక్ట్ స్కోర్ సాధించారని, ఇది చాలా అసాధారణమని పేర్కొన్నారు.ఒకే కేంద్రంలో అత్యధిక స్కోర్‌లను ఇలా క్లస్టరింగ్ చేయడం చాలా అసంభవం.పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.అత్యధికస్కోర్‌లకు సంబంధించి జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ అందించిన వివరణ సంతృప్తికరంగా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.పరీక్ష సమయంలో సమయం వృధా చేయడం వల్ల గ్రేస్ మార్కులు ఇచ్చామని చెప్పడం సబబేనా, సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో మీడియా నిమగ్నమై ఉన్న సమయంలో జాతీయ పరీక్షా నిర్వహణ సంస్థ తీరు మరింత అనుమానాన్ని పెంచింది. అశాస్త్రీయమైన పెరుగుదలతో కటాఫ్ సెట్ చేయబడిందని,నీట్-2023తో పోల్చితే అదే స్కోర్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ మూడు నుండి నాలుగు రెట్లు పెరిగింది, ఇది సమర్థనీయం కాదు. పరీక్షా ప్రక్రియ, ఫలితాలను విచారించే వరకు కౌన్సెలింగ్ నిర్వహించరాదని భారతీయ బౌద్ధమహాసభ, సమతా సైనిక్ దళ్ నాయకులు సుదర్శనం కోరారు.మరింత సమాచారం కోసం 9491556707 సంప్రదించాలన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *