మాదాపూర్‌లో అక్రమంగా సరోగసి,ఎగ్ ట్రేడింగ్ నిర్వహిస్తున్న ఆసుపత్రులపై వైద్య,ఆరోగ్య శాఖ,పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు.సరోగసీ పేరుతో సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం డాక్టర్ నమ్రత అక్రమ మానవ రవాణాకు పాల్పడిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.దీనిని తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం అన్ని ఫర్టిలిటీ సెంటర్లపై విస్తృత తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది.ఈ క్రమంలోని మాదాపూర్‌లో ఉన్న ఫెర్టిలిటీ కేంద్రాలలో అక్రమంగా సరోగసి,ఎగ్ ట్రేడింగ్ పేరుతో డొనేట్ చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశామని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి చెప్పారు.సంతానోత్పత్తి పేరుతో దోపిడీకి పాల్పడుతున్న కేంద్రాలపై దాడులు నిర్వహించి ఏడు మంది మహిళలను ఒక పురుషుడును అదుపులోకి తీసుకున్నారు. సంతానం లేని దంపతులే వీరికి పెట్టుబడి. ప్రధాన సూత్రధారి నర్రెడ్డుల లక్ష్మిరెడ్డి అద్దెకు గర్భం ఇచ్చి డబ్బులు సంపాదించేవారని పోలీసు విచారణలో తేలింది. ఫెర్టిలిటీ ఆసుపత్రుల నిర్వాహకులతో తనుకున్న పరిచయాలను ఉపయోగించుకుని ఆర్థిక ఇబ్బందులతో ఉన్న మహిళలను గుర్తించి తన ఇంట్లో ఆశ్రయం కల్పించేది.మాయమాటలు చెప్పి అద్దెకు గర్భనిచ్చేందుకు ఒప్పించేది. వారిని ఫెర్టిలిటీ సెంటర్లకు తరలించేది. ఇందుకయ్యే ఖర్చు అయా ఆసుపత్రిలో యజమానించి వసూలు చేసేవారు. జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీర్ గా పనిచేసిన లక్ష్మి రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి ఈ అక్రమ వ్యాపార నిర్వహించడంలో తల్లికి సహకరించేవాడు. ఈ వ్యాపారం ద్వారా లక్షల రూపాయల సంపాదించారు..తల్లీ కొడుకులు ఎగ్ డోనర్, సరోగసి మదర్‌గా ఒప్పందాలు చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధరించారు.లక్ష్మి రెడ్డి మహారాష్ట్రలో మానవ అక్రమ రవాణా కేసులో నిందితురాలిగా ఉన్నట్లు తేలింది. వీరు సులభంగా డబ్బులు సంపాదించాలని అక్రమ సరోగసి విధానానికి తెరలేపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని డీసీపీ తెలిపారు.
పేద మహిళలలే టార్గెట్ చేసి అక్రమ వ్యాపారం చేస్తూన్న
లక్ష్మీ రెడ్డి నుంచి 6.47 లక్షల నగదు ఆమె కుమారుడు నుంచి లాప్టాప్ లు ప్రామిసరీ నోట్లు, అధిక మొత్తం లో సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజక్షన్లు, నిందితుల నుంచి ఐదు సెల్ ఫోన్లు, కీప్యాడ్ స్వాధీనం చేసుకున్నారు. నర్రెద్దుల లక్ష్మి గతంలో ఈ తరహా కేసులు అరెస్ట అయ్యారని తెలిపారు. ఈ రాకెట్ తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ శోభన్ కుమార్ చెప్పారు.ఈ తనిఖీలను పర్యవేక్షించడానికి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ నేతృత్వంలో 35 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫర్టిలిటీ సెంటర్లలో సోదాలు నిర్వహించి, నిబంధనలను పరిశీలిస్తున్నాయి. అందులో భాగంగా ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నర్రెద్దుల లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. లక్ష్మి గతంలో ఎగ్ డోనర్, సరోగేట్ మదర్‌గా పని చేసినట్లు తెలుస్తోంది. దీంతో డబ్బు అవసరం ఉన్న పేద మహిళలను ఎంచుకున్న తల్లీ కొడుకులు ఎగ్ డోనర్, సరోగసి మదర్‌లతో ఒప్పందాలు చేసి డబ్బు సంపాదిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.
సరోగసీకి పాల్పడుతున్న తల్లి కొడుకు,ఎగ్ డొనేటర్లు అరెస్ట్
ఏడుగురు మహిళలు, ఒక పురుషుడు అరెస్ట్ చేశారు. వీరంతా విశాఖ,విజయనగరం ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన నిరుపేద మహిళలు.పిల్లలు లేని దంపతులను టార్గెట్ చేసుకుని డబ్బు ఎరగా వేస్తారు. ఆసుపత్రుల నుంచి 15- 20 లక్షలు డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు.మహిళలకు మాత్రం నామమాత్రంగా చెల్లిస్తున్నట్లు తెలిసింది. కాగా పట్టుబడ్డ లక్ష్మీ రెడ్డి కుమారుడు నరేందర్ రెడ్డి కెమికల్ ఇంజనీరింగ్ చదివాడని అక్రమ సంపాదనకు అలవాటు పడి అమ్మకి తోడుగా ఈ వ్యాపారంలోకి దిగాడని డీసీపీ తెలిపారు.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి వద్ద నుంచి 6.47 లక్షల నగదు, లెనోవో ల్యాప్‌టాప్, ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
సిరంజీలు, గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, హెగ్డే హాస్పిటల్,అమూల్య ఐవిఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఆసుపత్రి కేస్ షీట్లు స్వాధీనం చేసుకున్నామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు.