
గౌలిదొడ్డిలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం జాతీయ స్థాయు ప్యారా స్పోర్ట్స్ పోటీలకు వేదికయ్యింది. ఇక్కడ వివిధ రకాల క్రీడలకు ఎంపిక, శిక్షణ, శిబిరం నిర్వహించారు.నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ రీజియన్, ఉప సంచాలకులు టి గోపాల కృష్ణ సారధ్యంలో ఆదిత్య మెహత ఫోండేషన్ నిర్వహణ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.జాతీయ స్థాయిలో నవోదయ లో చదువు కుంటున్న విభిన్న అంశాలలో సామర్ధ్యము ఉన్న విద్యార్థులకు ఆశక్తిని బట్టి క్రీడా రంగంలో ఎంపిక నిర్వహించారు.ఇందుకు రంగారెడ్డి జవహర్ నవోదయ విద్యాలయ వేదిక కావడం ఆనందంగా ఉందని ఉపాద్యాయులు చెప్పారు.ఈ క్రీడా ఎంపిక కోసం దేశంలోని వివిద రాష్ట్రాల నుంచి దివ్యంగ క్రీడాకారుల వచ్చారు.క్రీడలలో తమ ప్రతిభను చూపడానికి 121 మంది బాలురు,58 మంది బాలికలు, 44 మందిక్రీడా ఉపాధ్యాయులు,తల్లి దండ్రులు వచ్చారు.శిల్లాంగ్, జైపూర్, చండీ ఘర్, లక్నో, పాట్నా, పూనా, భోపాల్ హైదరాబాద్రీజియన్ ల నుండి విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నరు. విద్యార్థులకు వసతి, భోజనాలు, క్రీడా ప్రాంగణా లు, రక్షణ, భద్రతలు వంటి అన్ని ఏర్పాట్లు రంగారెడ్డి జవహర్ నవోదయ విద్యాలయలో ప్రదాన ఆచార్యులు డి. విజయ్ భాస్కర్ తగిన ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమానికిముఖ్య అతిధిగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మొహంతి, ఏ ఎం ఎఫ్ కు ట్రస్టీగా ఉన్న నటి రేజినా హాజరయ్యారు.నవోదయంలో చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు క్రీడల పోటీలు వరంగా మారయని వారు అన్నారు.జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటల పోటీల్లో పాల్గొని అనేక విజయాలు సాధించడంలో ఉపాద్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.థాయిలాండ్ దేశంలో నిర్వహించిన ఆటల పోటీలలోప్రతిభ కనబరిచిన నవోదయ విద్యార్థులకు అభినందించారు.షూటింగ్ విభాగంలోజ్యోతి,కుశ్బూ శివాని, శివ, జానూ విద్యార్థులు పతకాలు పొందినందుకుఅభినందనలు తెలిపారు.వారం రోజుల పాటు నిర్వహించే శిక్షణ శిబిరంలో అత్యుత్తమ ప్రధమ కనపర్చిన విద్యార్థులను ఎంపిక చేసి అంతర్జాతీయ క్రీడా పోటీలలో పాల్గొన్నందుకు అవకాశం కల్పిస్తామన్నారు.