హేతువాద దృక్పథం,తార్కిక ఆలోచన విధానం కొరవడితే మనిషి మనుగడ ′ప్రశ్నర్ధకం అవుతుందని మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కోర్ణాన ఉమాపతి ఆందోళన వ్యక్తం చేశారు.మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో దేశ మొదటి ఉపాధ్యాయిని సావిత్రిబాయి పూలే జయంతి వేడుక ఘనంగా నిర్వహించారు.ఈసమావేశంలో అధ్యక్షురాలు పిట్ట. గీతారాణి సావిత్రిబాయి పూలే జీవిత విశేషాలు వివరించారు.ఆమె ఆలోచన విధానం విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు.గౌరవ అధ్యక్షులు కోర్నాన. ఉమాపతి మాట్లాడుతూ బుద్ధుడు మార్గంలో హేతువాద దృక్పథంతో మనిషి మనుగడ సాధ్యమవుతుందని చెప్పారు.ప్రధాన కార్యదర్శి తుంగాన సూర్యం మాట్లాడుతూ శాస్త్రవేత్తలు, అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నవాళ్లు ఉపాధ్యాయులు, విద్యావంతులు మూఢనమ్మకాల నిర్మూలనకు కృషి చేసినప్పుడే సమాజం మారుతుందని చెప్పారు..సహాయ కార్యదర్శి కుత్తం.లోకనాదం మాట్లాడుతూ ఒక గొప్ప సంఘసంస్కర్త సావిత్రి భాయ్ పూలే జన్మదిన వేడుకలో జరుపుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నారు.శాస్త్రీయజ్ఞానంతోనే మూడు నమకాలు నిర్మూలన సాధ్యమనిఉపాధ్యాయులు కంచరాన. రమేష్ తుంగాన శంకర్రావు, గవ్వ. భీమారావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కుల నిర్మూలన సంఘ ప్రతినిధులు మామిడి గణపతి, సార సోమేశ్వరరావు, పిట్ట జోగారావు, ప్రవీణ్ కుమార్, బోకర కృష్ణవేణి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.