
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్‌పల్లిలో భారీ నగదు చోరీ ఘటన సంచలనంగా మారింది.యాక్సిస్ బ్యాంక్ ఏటిఎంలలో నగదు నింపేందుకు సిఎంఎస్ (CMS) వాహనంతో ఉద్యోగుల చేరుకున్నారు.గురువారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ఇద్దరు కస్టోడియన్లు బ్యాంక్ లోపల నగదు నింపే పనిలో ఉండగా సెక్యూరిటీ గార్డు బయటకు వెళ్లారు .అదే సమయంలో డ్రైవర్ అజిత్ (అలియాస్ శివ) రూ.60 లక్షల నగదుతో సహా తీసుకుని పరారయాడు.నిందితుడు వాహనాన్ని తెల్లాపూర్ సమీపంలో వదిలివేసి లోపల ఉన్న సుమారు రూ.60 లక్షల నగదుతో పరారయ్యాడు. చిక్కుడు కాడ వచ్చేసరికి వాహనం కనిపించకపోవడంతో బ్యాంకు లోపల ఉన్న కస్టోడియన్ కు సమాచారం అందించాడు.వెంటనే గచ్చిబౌలి పోలీసుల సమాచారం అందించారు.సీఎంఎస్ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపారు.
నగదు ఎత్తుకుపోయాడు ఇలా…ఉద్యోగి రామకృష్ణ
ఉద్యోగి రామకృష్ణ,అబ్దుల్ మాలిక్, పెరుమాళ్ (గార్డ్), డ్రైవర్ అజిత్ కుమార్ లు సంగం సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో గత ఆరు నెలలుగా పనిచేస్తున్నారు.వారంతా కలిసి గోపన్‌పల్లి గ్రామంలోని యాక్సిస్ బ్యాంక్ ATM సెంటర్‌లోకి నగదును డిపాజిట్ చేయడానికి దాదాపు 4:35 గంటలకు వెళ్లారు. రామకృష్ణ, అబ్దుల్ మాలిక్ చెస్ట్ బాక్స్‌లో ఉన్న నగదును డిపాజిట్ చేయడానికి ATM సెంటర్ లోపలికి వెళ్ళారు.ఇంతలోనే సెక్యూరిటీ గార్డు పెరుమాళ్ CMS వాహన డ్రైవర్ అజిత్ కుమార్ బయట రోడ్డుపై నిలబడి ఉన్నారు. పెరుమాళ్ నీరు తీసుకురావడానికి వెళ్లారు. ఈలోగా, డ్రైవర్ అజిత్ కుమార్ CMS వ్యాన్‌లో మిగిలిన నగదుతో పాటు అక్కడి నుండి పారిపోయారు.దాదాపు రూ. 60 లక్షలు ఉంటుంది.డయల్ 100 కాల్ అందిన వెంటనే, గచ్చిబౌలి పోలీసులు రాత్రి 8:05 గంటలకు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లారు. చెస్ట్ బాక్స్‌లోకి నగదు నింపడంలో పాల్గొన్న సిబ్బందిని విచారించారు. అజిత్ కుమార్ వాహనంతో పాటు ఉడాయించిన ప్రదేశాలను తనిఖీ చేశారు.అజిత్ సాయంత్రం 5:50 గంటల నుండి తన మొబైల్ ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసినట్లు తేలింది. వ్యాన్ యొక్క GPSని ట్రాక్ చేయగా, TS 10UD 0393 నంబర్ కలిగిన వ్యాన్ కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తెల్లాపూర్ గద్దర్ జంక్షన్ వద్ద కనుగొన్నారు. వాహనంలో ఉండాల్సిన బాక్స్ మాయం అయినట్లు గుర్తించారు.