
శ్రీకాకుళం తెలుగు పద్యం ముగబోయింది.మాస్టారు మట్ట సూర్యనారాయణ మృతి చెందారు.గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరిన సూర్యనారాయణ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో వైద్యులు ఇంటికి పంపించివేశారు.ఇంటి వద్ద చికిత్స పొందుతూ ఈరాత్రి తుదిశ్వాస విడిచారు.ఉత్పలమాల,చంపకమాల,శార్దూలము, మత్తేభమువృత్తాలతో,కందము,ఉత్సాహ,జాతులు, సీసము, తేటగీతి,ఆటవెలది అనే ఉపజాతులు అనేక పద్యాలు తాత్పర్యంతో వివరించిన ఆ గొంతుక మూగబోయింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ నెల క్రితమే పదవి విరమణ పొందారు. ప్రభుత్వం నుంచి రావలసిన ప్రోత్సాహకాల కోసం దరఖాస్తు చేసుకునే లోపే అనారోగ్య సమస్యల గురై తుది శ్వాస విడిచారు. ఐదేళ్ల క్రితం తన సహధర్మచారిని రవణమ్మ మృతితో కృంగిపోయారు. చివరిగా మాణిక్యపురంలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ పదవివిరమణ పొందారు.సూర్యనారాయణ,రవణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. సొంత ఊరు అంబుగాము అయిన లోహరిబంద గ్రామం తో అనుబంధం పెంచుకున్నారు. సోంపేటలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. మట్ట సూర్యనారాయణ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. కవిత్వపుదోటలో నవతరం పద్య కవి, ఉపాధ్యాయుడు సూర్యనారాయణ మృతి తెలుగు పద్యానికి తీవ్ర లోటు అని సీనియర్ జర్నలిస్టు తలగాన లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. తన పద్యాలతో సామాజిక చైతన్యాన్ని కలిగించిన సూరి ఇక లేడు అని తెలిసి తీవ్ర వేదనకు గురవుతున్నట్లు న్యాయవాది బంటు కృష్ణారావు విచార వ్యక్తం చేశారు. మట్ట సూర్యనారాయణ తనదైన జీవనంలోంచి గొప్ప సాహితీ సృజన చేశారని ఉపాధ్యాయునిగా బాధ్యతయుతంగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నారని సహా ఉపాధ్యాయుడు సంక కాళిదాసు గుర్తు చేసుకున్నారు. పద్యం వచనం, కవిత్వం రూపంలో దళిత సాహిత్య పరిమళాలు వెదజల్లారారని తోటి ఉపాధ్యాయులు మందస షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం నాయకులు కొనియాడారు. ఆయన మృతికి తీవ్ర సంతాపం ప్రకటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. లోహరిబంద గ్రామంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు చెప్పారు.
.సెల్ ఫోన్ చోరికి గురైతే పట్టేయొచ్చు…. ఫోన్ దొంగలకు ఇక బేడీలే