నగలు షాపులో దోపిడీకి పక్కాగా రెక్కీ నిర్వహించారు. పట్టపగలే దోపిడీకి భరితెగించారు.పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు స్కెచ్ వేశారు పారిపోయేందుకు ఒకచోట ఆటో ఉంచారు. చోరీ చేసిన బైకుతో దోపిడీకి వచ్చారు. సినిమా సన్నివేశాన్ని తలపించే ఈ దోపిడి దొంగలను సైబరాబాద్ పోలీసులు మెరుపువేగంతో స్పందించి అరెస్టు చేశారు.

మేడ్చల్‌లోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు.బంగారు దుకాణాలే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారని సీపీ అవినాష్ మహంతి తెలిపారు.మేడ్చల్‌లోని నగల దుకాణంలో చోరీకి పాల్పడిన నిందితులను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేశారు. చోరీకి పాల్పడిన ఇద్దరు దుండగులను 24 గంటల్లో పట్టుకున్నారు. హెల్మెట్, బురఖా ధరించి జగదాంబ నగల దుకాణంలోకి ప్రవేశించిన నిందితులు షాపు యజమానిపై కత్తితో దాడి చేసి డబ్బులు లాక్కెళ్లారు. నగల దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మేడ్చల్ నగల దుకాణంలో చోరీ కేసును ఛేదించారు. ఈ నెల 20న జగదాంబ దుకాణంలో నగలు, నగదు చోరీ సంచలనంగా మారింది.కేవలం 40 సెకన్ల పాటు షాపులో ఉన్నారు. దొంగ కత్తితో బెదిరించి దోపిడీకి పాల్పడ్డాడు.ఇంతలోనే షాప్ లో ఉన్న మరో వ్యక్తి అరవడంతో చాకుతో బెదిరిస్తూ పరిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులునిందితుల కోసం వేట ప్రారంభించారు. 200 సీసీ కెమెరాలను పరిశీలించారు. కిలోమీటరు దూరంలో బైక్‌ను వదిలేసి పారిపోయినట్లు గుర్తించారు. బైక్ నెంబర్ ఆధారంగా యజమాని ఆచూకీ తెలుసుకున్నారు. ఓయూలోని హబ్సిగూడలో బైక్ చోరీకి గురైనట్లు గుర్తించారు. 16 బృందాలు రంగంలోకి దిగాయి.. చాదర్ ఘాట్‌లో జరిగిన చోరీ కేసులో వీరి ప్రమేయం కూడా ఉందని చెప్పారు. నజీమ్, సోహైల్‌లను అరెస్టు చేశారు. గతంలో కూడా మూడు సార్లు దోపిడీ ఘటనలు జరిగాయని తెలిపారు. బంగారు దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారని సీపీ మహంతి తెలిపారు. సంచలనంగా మారిన కేసును చాలెంజిగా తీసుకున్న దొంగలు అరెస్ట్ చేసిన పోలీసు అధికారులను సిపి అభినందించారు