
పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన పదవికి రాజీనామా చేసి ప్రజా తీర్పుకోరాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.పార్టీ ఫిరాయింపు నియోజకవర్గ అభివృద్ధి కోసమా?సొంత ఆస్తులు కూడబెట్టుకోవడానికా స్పష్టం చేయాలన్నారు.గాంధీపై అనర్హతవేటు వేయాలని కోర్టును ఆశ్రయిస్తామన్నారు.తనఅనుచరులు,అనుయాయులువందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జా చేశరని వాటిని రక్షించుకునేందుకు ఈ చర్యకు పాల్పడ్డారని రవికుమార్ ఆరోపించారు.ప్రజలకు నిలువునా మోసం చేశారని ప్రజల కష్ట సుఖాలలో పాలుపంచుకోకుండా సొంత వ్యాపారాలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆన్నారు.శేర్లింగంపల్లి ప్రజల్ని మోసం చేసిన అరికెపూడి గాంధీ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలి. పార్టీలు పిరాయించిన గాంధీ పై ఆనర్హత వేటు వెయ్యాలని కోరారు.ఇందుకోసం న్యాయపోరాటం చేస్తామన్నారు.శేరిలింగంపల్లిలో మరో ఆరు నెలల్లో బై ఎలక్షన్ వస్తుందని జోష్యం చెప్పారు. గాంధీ అవినీతిపరుడని ఎన్నికల సమయంలోనే ఆరోపించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన్ని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. పేరులో గాంధీ ఉన్నా అన్ని దొంగబుద్ధిలేనని ఆరోపించిన ముఖ్యమంత్రి తాను అన్న మాట తప్పారని విచారం వ్యక్తం చేశారు.ఇంకారవికుమార్ యాదవ్ఏ మన్నారంటే.సుందరీకరణ పేరుతో చెరువుల్లోనీటిని తొలగించారు.నాలుగు ఏళ్లు అవుతున్నా అభివృద్ధి పనులు పూర్తిచేసి నీటిని నింపేందుకు కృషి చేయని ఎమ్మెల్యే గాంధీ తన అనుచరులు ద్వారా కబ్జాలకు పాల్పడుతున్నారు.అభివృద్ది పేరుతో పార్టీలు మారడం తప్ప శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదుప్రజలను మోసం చేసి వ్యక్తిగత స్వలాభం కోసం రాజకీయం చేస్తున్నారు.విద్యా, వైద్యం కోసం చేసిన అభివృద్ధి శూన్యం.డిగ్రీ కళాశాల నిర్మించలేదు.దీనితో నిరుపేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.230 కోట్లతో చెరువులు సుందరీకరణ కోసం మంజూరయిన నిధులు దుర్వినియోగం పై దర్యాప్తు జరపాలి.మాజీ కార్పొరేటర్ నవత రెడ్డి మాట్లాడుతూ అరికెపూడి గాంధీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి పబ్బం గడుపుకుంటున్నారు.బీజేపీ నాయకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ నీతిమాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు .కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు గగ్గోలు పెట్టిన రేవంత్ రెడ్డి అదే తప్పిదం చేస్తున్నారని ఈ విధానం ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదన్నారు అధికారం పార్టీ లో చేరితేనే చట్ట విరుద్ధ పనులకు ఆస్కారం ఉంటుందని బలంగా నమ్ముతున్నారని ,చేసిన స్కాంలు బయటపడకుండా ఉండేందుకే అధికార పార్టీలో చేరారని ఆరోపించారు .తెలుగుదేశం మద్దతుదారుల ఓట్లతో గెలిచి ఆ పార్టీకి ద్రోహం చేసిన గాంధీ బిఆర్ఎస్ పార్టీని కూడా తన అవసరాలకు వాడుకొని కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు.