మత్తు మనిషిని చిత్తు చేస్తోంది. విలువైన జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. మత్తు బారిన పడుతున్న యువత బంగారు భవిష్యత్తు అంధకారం అవుతుందని చెప్పడానికి బ్రిలియంట్ స్టూడెంట్
నవీన్ నాయక్ ఉదంతం సర్వత్ర ఆందోళన కలిగిస్తుంది. డ్రగ్స్ బారిన పడితే ఎంత నష్టమో జీవితాలు ఎలా నాశనం అవుతాయో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ నవీన్ డ్రగ్ పెడ్లర్ గా మారి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.2015లో ఎన్ఐటి సీటు సాధించడంతో ఆ కుటుంబంలో ఆనందం వ్యక్తం అయింది. కుమారుని మంచి భవిష్యత్తు తలచుకొని తల్లిదండ్రులు పడ్డ సంతోషం కొడుకు డ్రగ్స్ బానిసగా మాట్లాడడం తెలుసుకొని నిర్ధాంత పోయారు..ఆల్ ఇండియా కేటగిరీలో 800 ర్యాంకు సాధించిన నవీన్హైదరాబాద్బోయిన్పల్లి నివాసం ఉంటున్నాడు. మత్తు పదార్థాలు అలవాటు పడి ఆ ఊబి నుండి బయటపడలేక చివరికి డ్రగ్స్ సరఫరా దారుగా మారిమాదాపూర్ కాప్స్, నార్కోటిక్ పోలీసులు సంయుక్తఆపరేషన్ లో పట్టుబడ్డాడు. నవీన్ ఉదాంతం తెలుసుకున్న పోలీసులు నివ్వెర పోయారు. మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర కాపుకాసిసచిన్, నవీన్ నాయక్, ప్రణీత్ రెడ్డి, రాహుల్ లను అరెస్ట్చేశారు.వీరి వద్ద నుండి ఒకటిన్నర కేజీల గంజాయిని సీజ్ చేశారు.నార్కోటిక్ బ్యూరో ఎస్పీ సాయి చైతన్య మీడియా సమావేశం లో పలు కీలక విషయాలు వెల్లడించారు.ఇందులో సచిన్ డ్రగ్ సరఫరా దారుడిగా ఉన్నాడు..ఇతను దూద్ బోలిలో ఉంటాడు. మిగతా ముగ్గురికి గంజాయి సప్లై చేస్తూ పట్టుబడ్డారు.మరో డ్రగ్ సరఫరాదారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.ఇందులోనవీన్ పై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. నాన్ బెయిల్ బుల్ వారెంట్ పెండింగ్ లో ఉంది..కేరళ పాలక్కాడ్ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు ఉంది.. ఆ కేసులో శిక్ష పడ్డ అతనిలో పరివర్తన రాలేదు. ఎన్ఐటిలో చదువుతుండగానే నవీన్ కు చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు .. గంజాయి ఇతర పదార్థాలకు అలవాటు పడ్డాడు.2018 తర్వాత చదువు మధ్యలో ఆపేసాడు.. డ్రగ్స్ అలవాటు పడ్డ విషయం తెలుసుకున్నాక తల్లిదండ్రులు మార్చే ప్రయత్నం చేశారు.అతనిలో మార్పు రాక చదువు మధ్యలో మానేసి బెంగళూరు వెళ్లి డ్రగ్స్ సప్లయర్తో మాట్లాడి ఫెడ్లర్ గా మారాడు.2022 వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి డ్రగ్ సప్లై చేసినప్పుడు దుండిగల్ పోలీసులు కేసు నమోదు చేశారు.అప్పుడు తప్పించుకున్నాడు..తాజాగా హైదరాబాదులో డ్రగ్స్ కన్జ్యూమ్ చేయడానికి వచ్చాడు.. సమాచారం అందడంతో అరెస్టు చేసామని ఎస్పీ తెలిపారు,
తప్పెవరిది శిక్ష ఎవరికీ
తల్లిదండ్రులు పిల్లలపై నిఘా ఉంచాలి,విద్యాసంస్థల్లో కూడా హాస్టల్లో తనిఖీలు నిర్వహించాలి.డ్రగ్స్ బారిన పడవద్దు . జీవితాలను నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ కు వ్యసనపరులను రీహబిలిటేషన్ సెంటర్ కు తరలించి వారిలో మార్పు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాం యాంటీ డ్రగ్స్ కమిటీలను స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాండ్రగ్స్ పై ఎవరికైనా సమాచారం ఉంటే మాకు సమాచారం ఇవ్వాలిడ్రగ్స్ సేవించిన వారిని వెంటనే మూత్ర పరీక్షలు నిర్వహించి నిర్ధారణ చేసుకుంటాంగంజాయి, మత్తు పదార్థాలను విక్రయించే వారిని ఉక్కుపాదంతో ఆనిచివేస్తాంసప్లయర్లు ఉంటే ఆ వృత్తి మానేయాలి.
డ్రగ్స్ వ్యసనపరుడు నవీన్.
డ్రగ్స్ కు అడిక్ట్ అవ్వడం వల్ల ఎన్ఐటి లో డ్రాప్ అవుట్ అయ్యాను,2018 నుండి డ్రగ్స్ అలవాటు పడ్డాను,డ్రగ్స్ నుంచి బయటపడదాం అనుకున్నాను కానీ వ్యసనంగా మారడం వల్ల బయటపడలేదు.డ్రగ్స్ కు ఎవరు అలవాటు పడద్దు.. అది జీవితాలను కుటుంబాలను నాశనం చేస్తుందిడ్రగ్స్ వల్ల నేను జీవితాన్ని నాశనం చేసుకున్నాను.టెన్షన్స్ నుండి బయటపడడానికి యోగ వ్యాయామం లాంటివి చేయాలి కానీ డ్రగ్స్ కు అలవాటపడొద్దుడ్రగ్స్ నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేస్తుందిడ్రగ్స్ సప్లై చేసే వాళ్ళు ఎవరో తప్పించుకోలేరుడ్రగ్స్ తీసుకోవడం వల్ల గత 7 ఏళ్లగా నేను ఇంటికి వెళ్లడం మానేశాను
.