
ప్రముఖ సింగర్ కల్పన స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.రెండు రోజులుగా తాను నివాసం ఉంటున్న ఇంటి డోర్ ఓపెన్ చేయకపోవడంతో తోటి అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్ఛారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.స్థానికుల సహాయంతో పోలీసులు డోర్ ఓపెన్ చేశారు.మంచంపై అన్ కాన్సెస్ లో పడి ఉండటంతో పోలీసులు సమీపంలోని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు.ప్రస్తుతం కల్పన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు.నిజాంపేట్ వర్టెక్స్ ఫ్రీ విలేజ్ లో నివాసం ఉంటున్న గాయని కల్పన ముందుగా ఆత్మహత్యకు పాల్పడ్డారని వదంతులు వ్యాపించాయి.నిద్ర మాత్రలు మింగినట్లు ప్రచారం జరిగింది.కల్పన అస్వస్థత సమాచారం తెలుసుకున్న తోటి గాయనీ గాయకులు కల్పన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వచ్చి పరామర్శిస్తున్నారు.కల్పన భర్త ఆసుపత్రికి చేరుకున్నారు.