ప్రగ్యశ్రీ పేరుకు తగ్గట్టే ప్రజ్ఞావంతురాలు. చదువులో చక్కగా రాణిస్తుంది.ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రులకు చేదోడు వాదోడిగా ఉండాలని ప్రజ్ఞ శ్రీ ఆకాంక్ష .ఇంతలోనే ఊహించిన ఆపద ఎదురయింది.నిండా 16 ఏళ్ళు కూడా లేవు. హై బీపీ కారణంగా కిడ్నీలు పాడైపోయినట్లు వైద్యులు చెప్పారు.ఆ మాటలు ప్రజ్ఞాశ్రీ తల్లిదండ్రులకి తీవ్ర ఆవేదనకు గురి చేసింది. ఎంతో చలాకీగా ఉండే తమ కుమార్తె ప్రాణాంతక సమస్యతో బాధపడుతుందని తెలిసి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బిడ్డను బతికించుకునేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. ఇప్పటివరకు చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. దీంతో ఉన్న ఆస్తులన్ని హారతి కర్పూరంలా కరిగిపోయాయి.ప్రస్తుతం దాతలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.ప్రగ్యశ్రీ తండ్రి సత్యనారాయణ, తల్లి పుష్పలతతో కలిసి అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు.తండ్రి ప్రైవేట్ పరిశ్రమలు కార్మికుడిగా పని చేస్తున్నాడు.చాలిచాలని జీతం. కుటుంబ పోషణ భారంగా మారిన పరిస్థితులలో ప్రతి నెల సుమారు 65 వేలు డయాలసిస్ కోసం ఖర్చు చేస్తున్నారు.ఇప్పటి వరకు 15 లక్షలు ఖర్చు చేశారు.

చిన్నారికి కొత్త జీవితాన్ని ప్రసాదించండి
కాళ్ళ వాపుతో ప్రారంభమైన అనారోగ్య సమస్య ప్రగ్యశ్రీ కిడ్నీ ఫెయిల్యూర్ కు దారితీసింది. యూరిన్ లో ఏర్పడ్డ ఇన్ఫెక్షన్ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపించింది.హైబీపీకి దారితీసి
కిడ్నీ డిమెజ్ కు కారణమయ్యింది.ఈ హఠాత్ పరిణామానికి తల్లితండ్రులు హడలిపోయారు.ఖరీదైన వైద్యం అందించిన జరగాల్సిన నష్టం జరిగిపోయింది.2023 ఆగస్టు నుండి డయాలసిస్ కే పరిమితం చేసింది. హైదరాబాద్ లో ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో తమ బిడ్డకు చికిత్స అందిస్తున్నామని రోజు విడిచి రోజు డయాలసిస్ చేస్తున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు. తన బిడ్డకు కిడ్నీ దానం తానే చేస్తున్నట్లు ఆపరేషన్ ఖర్చు భరించలేక ఆర్థిక సహాయం అర్థిస్తున్నామని తల్లి పుష్పలత తెలిపారు.ప్రజ్ఞశ్రీ కి కిడ్నీ మార్పిడి కోసం పరీక్షలు జరుగుతున్నాయి. అన్ని అనుకూలిస్తే ఈ నెలలో ఆపరేషన్ ఉంటుందని వైద్యులు చెప్పినట్లు పుష్పలత వెల్లడించారు.ఇందుకోసం 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది.జన్మనిచ్చిన తల్లే కూతురు పునర్జన్మకు ముందుకు వచ్చింది. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు తల్లి కిడ్నీ అమర్చేందుకు సరిపోతున్నట్టు చెప్పారు. కుమార్తె ఆరోగ్యంగా మునుపటిలా తిరిగీతే చూడాలన్నది ఆ తల్లిదండ్రుల కళ. వారి ఆశయం నెరవేర్చి సరైన సమయం. ఈ క్లిష్ట సమయంలో దాతలు పెద్ద మనసుతో సహకరిస్తే ఒక నిండు ప్రాణన నిలబెట్టిన వాళ్ళవుతారు.కుమార్తె కిడ్నీ మార్పు కోసం ఆర్ధిక సహాయం అందించాలని దాతలను వేడుకొన్నారు.
మంచానికి పరిమితమైన..

ఏడాది కాలంగా ప్రగ్యశ్రీ కిడ్నీ వ్యాధితో మంచానికి పరిమితమయింది.డయాలసిస్ చేసుకుంటూనే పదో తరగతి ఫలితాల్లో 9.7జిపిఏ సాధించింది.పుట్టెడు బాధలోనూ చదువులో చక్కగా రాణించింది.ఆరోగ్య సమస్యలు లేకపోతే చదువులో మరింత రాణిస్తుందని తల్లి పుష్పలత కన్నీటి పర్యంతమయ్యారు. దాతలు సహృదయంతో స్పందించి ప్రగ్యశ్రీ కిడ్నీ ఆపరేషన్ కు ఆర్థిక సహాయం అందిస్తే ఆ బిడ్డ కోలుకుంటుంది.మునపటిలా సాధారణ పరిస్థితి కి చేరుకుంటుంది. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం కావాలని కోరుకుందాం.ఇందుకోసం దాతృత్వం చూపుదాం. ఆరోగ్యం కుదుట పడితే వచ్చే ఏడాది ఇంటర్ లో చేరుతానని చెప్పే ప్రజ్ఞశ్రీ ఆశయం నెరవేరాలి.చక్కటి ప్రతిభను కనబరుస్తుందని చదువు విషయంలో ఈ బాలికకు ఎంతో మక్కువ.ఆమె ఆశయం నెరవేరాలి.నిండు ప్రాణాలు కాపాడాలంటే ఆర్థిక సహాయం చేసే దాతలు గూగుల్ పే ఫోన్ పే 7893528773 కు ఆర్థిక అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.