
విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ గుండెపోటుతో మృతి చెందారు.ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం(ఏఫ్రిల్9) తెల్లవారుజామున మృతి చెందారు.తీవ్ర చాతి నొప్పిరావడంతో కుటుంబ సభ్యులుగచ్చిబౌలి AIG హాస్పిటల్ లో చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పోందుతు తేల్లవారుజామున మృతి చెందారు.1991 IPS బ్యాచ్ కు చెందిన రాజీవ్ రతన్ ముక్కుసూటి అధికారిగా పేరుంది.ప్రస్తుతం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ డీజీ గా రతన్ విధులు నిర్వహిస్తున్నారు.కాళేశ్వరం,మేడగడ్డ ప్రాజెక్టు పై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టిన రాజీవ్ రతన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.డి.జి ఫైర్ సర్వీస్, ఎం.డి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, ఎస్పి కరీంనగర్, విజిలెన్స్ , ఎన్ఫోర్స్మెంట్ డిజి గా రాజీవ్ రతన్ పలు కీలక బాధ్యతలను నిర్వహించారు.