
విశాఖపట్నం:(విశాల జ్యోతి)
తెనాలి,మల్లం ఘటనల్లో పోలీసులే బాధ్యులను చేసిఅరెస్ట్ చేయాలని విదసం నేతలు డిమాండ్ చేశారు.ఎస్సీ కమీషన్ ఆదేశాలను పాటించని అధికారులపై అట్రాసిటీ చట్టం సెక్షన్ 4 కింద కేసులు నమోదు చేయాలన్నారు.తెనాలి, మల్లం , విశాఖ జైలు డెత్ ఘటనల్లో దోషులను కాపాడుతూ కమీషన్ ఉత్తర్వులను లెక్కచేయని ఉన్నతాధికారుల పై కూడా చర్యలు తీసుకోవాలని విదసం ఐక్య వేదిక జాతీయ ఎస్సి కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచంద్ర కు పిర్యాదు చేశారు.విశాఖ పర్యటనకు విచ్చేసిన ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర ను మల్లం మృతుడు సురేష్ భార్య మణి, కస్టడీయాల్ మృతుడు తల్లి ఉప్పాడ నర్సయ్యమ్మ, గుడ్డిప అసైన్డ్ భూ బాధితులతో కలిసి సమస్యలు పరిష్కారం కోరుతూ వినతి విదసం నేతలు పత్రం అందజేశారు.

అనంతరం ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు మాట్లాడుతూ తెనాలి లో దళిత యువకులను నడి రోడ్డు మీద కొట్టిన ఘటన లో పోలీసుల పై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు .. మల్లం లో సాంఘీక బహిష్కరణ జరిగితే కనీసం కేసు కూడా నమోదు చేయలేదని మండిపడ్డారు.గత ఏడావి శాఖ సెంట్రల్ జైల్లో జరిగిన గౌరీ శంకర్ కస్టోడియల్ డెత్ బాధ్యులపై నేటికి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.దీనిపై కమిషన్ ఇచ్చిన ఉత్తర్వుల అమలు చేయాలన్నారు.ఇందుకు బాధ్యులైన జైలు సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని డిమాండు చేసారు. మల్లం మృతుడు సురేష్ భార్య కు ప్రభుత్వ ఉద్యోగం, ఇల్లు కేటాయించాలని కమిషన్ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరామన్నారు ..బాదితుల పిర్యాదులపై కమిషన్ ఇచ్చే ఆదేశాలు అమలు చేయని అధికారులను ప్రాసిక్యూట్ చేసే అధికారం కమిషన్ కు ఉందన్న విషయం అధికారులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సెక్షన్ 4 ప్రకారం బాధ్యులైన అధికారుల పై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో మల్లం మృతుడు పల్లపు సురేష్ భార్య మణి, కస్టోడియల్ మృతుడు తల్లి ఉప్పాడ నర్సయ్యమ్మ, గుడ్డిప అసైన్డ్ భూ బాధితులు, సంఘ నాయకులు జాజి ఓంకార్, బూల భాస్కర రావు, గుడివాడ ప్రసాద్, వడ్ల మురి ఫ్రాన్సిస్, అలమండ మంగ రాజు, గార బ్రహ్మాజీ తదితరులు పాల్గొన్నారు..