సమాజంలో నెలకొన్న అసమానతలు తొలగించేందుకు డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ కృషి చేస్తోందని ఆ సంస్ధ వ్యవస్థాపకురాలు ఆరుణ చెప్పారు.బడుగు బలహీనవర్గాల పిల్లలలో విద్యా పట్ల అవగాహన కలిగించేందుకు శ్రమిస్తున్నది.ఇందులోభాగంగా మేము బడి బాట అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం హైదరాబాద్
జవహర్లాల్ నెహ్రు టెక్నాలజికల్ యూనివర్సిటీ వాలంటీర్లు విద్యార్థులతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.బస్తీలలో పర్యటించి పిల్లలు, వారి తల్లిదండ్రులకు విద్య వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. బస్తీలలో తిరిగి తల్లిదండ్రులను విద్యా ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న సౌకర్యాలు గురించి అవగాహన కలిగించారు.తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేందుకు అంగీకరించడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డ్రీం ఫర్ గుడ్ సోసైటీ వ్యవస్థాపకురాలు చావా అరుణ, ఏఐజీ హాస్పిటల్
డాక్టర్ కల్యాణ్,JNTU విద్యార్థులు పాల్గొన్నారు.విద్యా వ్యాప్తి కోసం కృషి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తో ఒప్పందం కలిగిఉన్నామనివిద్యా పథకాలు విజయవంతంగా సమన్వయం చేస్తామని వివరించారు.ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో విద్యా ప్రాముఖ్యతను పెంచడానికి కృషి చేస్తున్నామనిడ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’ సంస్థ ప్రతినిధులు చెప్పారు.