
ఫ్రీ హోల్డ్ అసైన్డ్ భూములు లబ్ధిదారులు అమ్ముకునేలా వెసులుబాటు కల్పించాలని ఇందుకు సంభవించిన జీవో నెంబర్ 596 సవరణ చేయాలని విధసం ఐక్యవేదిక కన్వీనర్ భూషి వెంకట రావు డిమాండ్ చేశారు.మంత్రి నారా లోకేష్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలన లో శారదా పీఠం కు కేటాయించిన 15 ఎకరాల భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.విశాఖ విజయనగరం తోపాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో UFS 22A నుండి డీ నోటిఫై చేసిన సుమారు లక్ష ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలులో జరిగిన అక్రమాలపై సిటింగ్ న్యాయమూర్తిచే విచారణ జరపాలని,ఇప్పటి వరకూ కొనుగోలు చేసిన భూముల బరలాయింపు నిలిపి వేయాలని కోరారు.ఇన్సైడ్ ట్రేడింగ్ తో నష్ట పోయిన రైతులకు న్యాయం చేయాలని,ఆన్లైన్డ్ రైతులను మోసగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.అక్రమంగా 22a నుండి తొలగించిన భూములు తిరిగి స్వాదీనం చేసుకోవాలని,కోడి కత్తి శ్రీను,వీథి సుబ్రమణ్యం,డాక్టరు సుధాకర్,వెంకటాయుపాలేం శిరోమoడనం ,కొవ్వూరు బొంత మహేంద్ర , డాక్టర్ అచ్చెన్న, కేసులు పునర్విచారణ చేయాలని డిమాండ్ చేశారు.ఆంధ్ర యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ నియామకంలో ఎస్సి వర్గానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు.ఫీజు రీయింబర్స్మెంట్, అంబెడ్కర్ విద్యా దీవెన బకాయిలు విడుదల చేయాలని. విద్యుత్ బిల్లు షరతులు ఎత్తి వేయాలన్నారు.ఎయిడెడ్ పాఠశాలను ప్రభుత్వం స్వాదీనం చేసుకోవాలని,ఇంగ్లీష్ మీడియం కొనసాగించాలని,గత ముడు నెలలు నుండీ రావాల్సిన సామాజిక పెన్షన్ బకాయిలు చెల్లించాలని, అంబేద్కర్ ను అవమానించిన రఘురామ కృష్ణ రాజు ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలనికోరారు.మంత్రి లోకేష్ ను కలిసిన వారిలో ఈతలపాక సుజాత,జాజి ఓంకార్,కస్తూరి వెంకటరావు తదితరులు ఉన్నారు.