41 నోటిస్ కు లంచం అడిగిన మాదాపూర్ ఎస్ ఐ రంజిత్

మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్న రంజిత్, రైటర్ విక్రమ్ ను ఏసీబీ అధికారులు వలపన్నీ పట్టుకున్నారు.ఇళ్ల నిర్మాణం వివాదంలో మూదావత్ లక్ష్మణ్ పై చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ  మేరకు మాదాపూర్ పోలీస్లు కేసు నమోదు చేశారు.ఈపోలీస్ కేసు అడ్డం పెట్టుకొని ఎస్సై రంజిత్బెదిరింపులకు పాల్పడ్డాడు.41 సి ఆర్ పి సి కింద నోటీస్ ఇచ్చిన ఎస్ఐ రంజిత్లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరికి 20 వేలు ఇ లంచం ఇచ్చేందుకు అంగీకరించాడు.అదనంగా మరో 10 వేలు ఇవ్వాలని బెదిరించడంతో బాధితుడు మూడవత లక్ష్మణ్ ఏసీబి అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసిబి డి.ఎస్.పి ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏసీబీ బృందం మాదాపూర్ పోలీస్ స్టేషన్లోనే ఎస్సై రంజిత్ కు రైటర్ విక్రమ్ ద్వారా 30 వేలు లంచం  ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

కేసు నేపథ్యం ఇది

మాదాపూర్ సాయి నగర్ వికర్ సెక్షన్ కాలనీలో సర్వేనెంబర్1లో 100 గజాల ప్లాటును 1987లో ముడవత్ లక్ష్మణ్ కొనుగోలు చేసి .కుమార్తె పేరుపై ఆస్తిని బడలాయించినట్ల బాడితుడు చెప్పారు.కాగా ఈ స్థలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇంటి నిర్మాణం కోసం చందానగర్ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో అధికారులను కలిశానాని లక్ష్మణ్ చెప్పారు. .ఇల్లు నిర్మించుకోవాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని ఇవ్వాలని  బాధితుడు తెలిపారు.ఇందుకు అంగీకరించకపోవడంతో ఇంటి నిర్మాణాం  కూల్చివేశారని .అంతటితో ఆగకుండా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారని వాపోయాడు. ఈ కేసు విషయంలో చట్ట ప్రకారంగా వ్యవహరించాల్సిన ఎస్ఐ రంజిత్ బెబెదిరించి డబ్బులు డిమాండ్ చేశారు. అడిగినంత ఇవ్వకపోతే కూతురు, అల్లుడు  పై కేసు నమోదు చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డాడని వివరించాడు. ఎస్ ఐ వేదింపులు కారణంగానే ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు తెలిపారు. చందానగర్ టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణానికి లంచం డిమాండ్ చేశారని  ఆరోపించడం మూదావత్ లక్ష్మణ్ సంచలనంగా మారింది.  ప్లాట్ వివాదంలో తాము మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయలేదని టౌన్ ప్లానింగ్ విభాగం అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ చెప్పారు. లంచం వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందో దర్యాప్తు చేస్తామని ఏసీబీ డిఎస్పి తెలిపారు.

ఈ క్రింది లింక్స్ చదవండి

.ఆదిబట్ల లో అమానుషం తండ్రిని హత్య చేసిన తనయుడు

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పై ఘోరం

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *