నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు.జనంకోసం జీవిస్తే జనంలో ఉంటావు అన్న అంబేద్కర్ మాటలే స్ఫూర్తిగా.పొరుగువారికి సాయపడని జీవతం ఓ జీవితమేనా అన్న సినారే మాటలకు నిలువెత్తు నిదర్శమై ముందుకు సాగుతున్న బడియా కామరాజు జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన డెప్త్యూటీ అసిస్టెంట్ కమీషనర్ కమర్షియల్ టాక్స్ అధికారి బడియా కామరాజుకు శ్రీకాకుళం జిల్లా దళిత ఉద్యమ నాయకులు పదవి విరమణ వీడ్కోలు పలికారు.మీకున్న పూర్తి సమయాన్ని పీడిత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కేటాయించాలని కోరుతూ విశాల జ్యోతి ప్రత్యేక కథనం.

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి గ్రామంలో బడియా కమలమ్మ, పురుషోత్తం దంపతులకు 1963మార్చి 30న జన్మించారు.1వ తరగతి నుండి 5వ తరగతి వరకు సొంత ఊరిలోనే అక్షర జ్ఞానాన్ని పొంది 6,7 తరగతులు సొండిపూడి,8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సోంపేటలో చదివారు.చదువులోప్రతిభ కనపర్చడంతో అప్పుడే ఉపాధ్యాయులు,సహా విద్యార్థులు జీవితంలో సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా ఎదుగుతావని చెప్పేవారుఉన్నత చదువులైన డిగ్రీ శ్రీకాకుళం గవర్నమెంట్ ఆర్ట్స్ కళాశాలలో B.sc చదివి ప్రధమశ్రేణిలో ఉత్తిర్ణత పొందారు.APPSC నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనపరిచి 1986 నవంబర్ 27 వాణిజ్య పన్నుల శాఖ కాశీబుగ్గ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగ ప్రస్థానంప్రారభించారు.ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వరకు 38 సంవత్సరాల 8నెలల 4రోజులు ఉద్యోగిగా ఎలాంటి అవరోదాలు లేకుండా తన వృత్తి ధర్మాన్ని నిర్వహించి రెండు సార్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రశంస పత్రాలు, ఉత్తమ అధికారిగా విజయనగరం జాయింట్ కమీషనర్ ద్వారా అవార్డ్స్ ను కైవసం చేసుకొన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ దూర విద్య ద్వారా M.A, B. L పూర్తి చేశారు. కాశీబుగ్గ లో ప్రారంభమైన ఉద్యోగ బాధ్యతలు ఆమదాలవలస, ఇచ్చాపురం, నరసన్నపేట, రాజాం, శ్రీకాకుళం, పాడేరు, ప్రస్తుతం విశాఖపట్నం లో డెప్త్యూటీ అసిస్టెంట్ కమీషనర్ గా ఉద్యోగ పదవీ విరమణ చేస్తున్నారు.
వైవహిక జీవితం:
1996 జూన్ 1న కామరాజు కోటబొమ్మాళి మండలం అక్కివలస గ్రామీనికి చెందిన బెలమాన కృష్ణమూర్తి, లష్మిదేవి ద్వితీయ పుత్రిక శ్రీదేవితో వివాహం జరిగింది. మెట్టింటికి అడుగుపెట్టిన నాటినుండి ఇప్పటి వరకు పుట్టిల్లు మెట్టిల్లు అనే తేడా లేకుండా అందరినీ తానై నడిపించింది.డిపార్ట్మెంట్ లో గుమస్తాగా ఆమె ప్రస్థానంపోటీ పరీక్షలు రాస్తూ రెవిన్యూ డిపార్ట్మెంట్ లో గుమస్తా గా ప్రారంభమైన ఉద్యోగ జీవితం అంచేలంచేలగా ఎదుగుతూ డెప్త్యూటీ తహసీల్దార్ గా పదోన్నతి పొందారు శ్రీదేవికామరాజు.వారికి ఇద్దరు సంతానం. కొడుకు జ్ఞానదీఫ్ NIT వరంగల్ లో B.Tech పూర్తి చేసి పోటీ పరీక్షలల్లో మంచి ప్రతిభ కనపరుస్తూ చాలా ఉద్యోగాలు సెలెక్ట్ అయినా ఉన్నత ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్య సాధనలో ఉన్నాడు. కుమార్తె డాక్టర్ మానస ప్రస్తుతం రాజమండ్రి హోమియో కళాశాలలో M.D చదువుతున్నారు. కుటుంబం సంబంధాలు పతనం అవుతున్న ఈ కాలంలో అందరికీ ఆదర్శంగా నిలిచారు.పువ్వు పుట్టగానే పరిమలిస్తుందన్న చందంగానే ప్రాధమిక విద్య నుండే చదువులో చురుకుధనంతో పాటు మంచి ఆర్టిస్ట్ గా కామరాజు పేరు పొందారు.వారి గ్రామ పరిసర గ్రామాల్లో వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు కామరాజు రాసిన అందమైన సుస్వాగతం బోర్డులు ఫోటో తీసుకోని వెళ్లెవారు.బొమ్మలు వేయడం,ముత్యాలంటి అక్షరాలు వాల్ పెయింటింగ్ లో చేయి తిరిగిన మంచి కళాకారుడు. డిగ్రీ చదువుకొనే రోజుల్లో బొమ్మలు వేయడం రాని వారంతా ఇతని దగ్గర రికార్డు షీట్స్ లో బొమ్మలు వేయించుకోవడాని వేచి ఉండేవారు.స్నేహానికి, బంధుత్వానికి, ఎక్కవ విలువ ఇచ్చే కామరాజు స్నేహితులకు,అణగారిన తన జాతి హక్కుల సాధన కోసం ఎంతో సమయాన్ని కేటాయించిన మానవతావాది : ప్రముఖ కవి జయరాజు రాసిన పాట “స్నేహమేరా జీవితానికి వెలుగు నిచ్చే వెన్నెల” పాటకు అక్షరాలా ఆచరణశీలి.Pay బ్యాక్ టూ సొసైటీ అన్న అంబేద్కర్ మహాసయుడు మాటలకు చేతలకు దగ్గరగా నడిచే వ్యక్తత్వం. తన రక్త బంధువులందరిని అవకాశం ఉంటే తన దగ్గర లేకపోతె అతని తల్లిదండ్రులు వద్ద ఉంచి చదువుకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి వారు. ప్రయోజకులు అయ్యే వరకు వారికీ సరైన గైడెన్స్ ఇచ్చి వారందరికీ ఆఫీసర్ ర్యాంక్ లో ప్రస్తుతం వారంతా ఆత్మగౌరవంతో బ్రతికే విదంగా తీర్చిదిద్దారు.
దళిత ఉద్యమ స్పృహ:
సోంపేట పాత తాలూకా ప్రాంతంలో పుట్టిన దళిత నేతలు మాజీ శాసనసభ్యులు కొత్తపల్లి.నరసయ్య,కొత్తపల్లి. పున్నయ్య,గార కృష్ణమూర్తి, డాక్టర్ మిస్క. ఆనందరావు, రుంకు. అప్పారావు మోహన్ రావు సహచర్యం వల్ల దళిత స్పృహ,అంబేద్కరిజంకు అతిదగ్గరగా ఉంటున్నారు.జిల్లాలో దళిత ఉద్యమాలకు ఊపిరిలుదిన వీరీ పై ప్రభావం ఉన్నది. దేశావ్యాప్తంగా దళిత ఉద్యమానికి ప్రేరణ అయినా కారంచేడు ఉద్యమ కాలంలో నిరుద్యోగీగా ఉద్యమంలో పాల్గొన్నారు. చుండూరు ఉద్యమంలో ఉద్యోగిగా బేసి మోహనరావు ప్రోత్సాహంతో ప్రత్యక్షంగా పాల్గొని అన్ని నిరసన కార్యక్రమాల్లో తనకు చేతనైనంత మేరకు పాల్గొన్నారు.తోలాపి ఘటనలోమన జిల్లాలో 2012లో జరిగిన లక్ష్మిపేట ఘటనలో జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొని బాధితులకు, ఉద్యమానికి బాసటగా ఉన్నారు. నిందుతులను అరెస్ట్ కై దశలవారి కార్యక్రమం లో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరవధిక ధర్నా కార్యక్రమానికి భాదితులకు అండగా నిలబడ్డారు. శ్రీకాకుళం పట్టణంలో ఉద్యమ సమయంలో ఆందోళనకారులకు 18 రోజులు బోజన వసతి కల్పించి సుదీర్ఘకాలం దళిత ఉద్యమం కొనసాగించేందుకు దోహదపడ్డారు అంటే అది ఆయన నిబద్దతకు నిలువెత్తు నిదర్శనం.