గురుకుల పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ఆందోళన టీచర్లు కావాలంటూ డిమాండ్

  1. ఉపాద్యాయుల దీనోత్సవం రోజునే అధ్యాపకుల కోసం ధర్నా చేస్తున్న విద్యార్థులు

గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలేన్స్, తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ బాలికల ప్రతిభా కేంద్రం విధ్యార్థుల ఆందోళన..

ఐఐటి,నీట్ బోధించేందుకు నిపుణులైన పాత ఫ్యాకల్టి కావాలని రోడ్డు పై ధర్నా చేస్తున్న విధ్యార్థులు..

ఫ్యాకల్టీని తొలగించిన అధికారులు వచ్చే వరకు ఆందోళన విరమించేదే లేదని డిమాండ్..

దాదాపు 38 మంది కాంట్రాక్ట్ టిచింగ్ ఫ్యాకల్టీని తోలగించిన అధికారులు..

వారి స్థానంలో కోత్తగా రిక్రూట్ చేసిన ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించిన అధికారులు..

వారికి ఇంటర్ సబ్జెక్టులు బోధించడం తప్ప ఐఐటి, నిట్ సిలబస్ చేప్పడానికి రావడం లేదని ఆవేదన

గంటల తరబడి పాఠశాల గేటు ముందు బైఠాయించి ఆందోళన

కేవలం కొద్ది మంది ఉపాద్యాయులతో తరగతుల నిర్వహణ

బోధన సక్రమంగా జరకపోవడంతో విద్యార్థులలో ఆందోళన

ఇంటర్ లో వంద శాతం ఉత్తీర్ణత ఘనత దీని సొంతం

ఐఐఐటీ లో అత్యధికంగా చేరిన వారిలో గౌలిదొడ్డి విద్యార్దులు అధికం

ఉన్నపళంగా అధ్యాపకులు తొలగించడంతో విద్యార్థుల తల్లి తండ్రులు ఆగ్రహం

కళాశాల గేటుముందు ఆందోళన నిర్వహించనున్న విద్యార్ధులు

ప్రతిభ కేంద్రం గేటు ముందు విద్యార్థినులు ఆందోళన

గురుకుల పాఠశాల సెక్రటరీ అలుగు వర్శిని అనాలోచిత నిర్ణయాలు గురుకుల పాఠశాల విద్యార్థుల పాలిట శాపంగా మారింది.అధ్యాపకులను తొలగించడంతో గౌలుదొడ్డి గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐఐటీలో ఉత్తమ శిక్షణ ఇచ్చే గురుకులల్లో బోధన సిబ్బందిని తొలగించడం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవల గురుకుల పాఠశాలలో రిక్రూట్మెంట్ చేసిన సొసైటీ నగరంలో ఉన్న నాలుగు గురుకుల పాఠశాలలో బోధన కోసం నియమించింది. కాంట్రాక్ట్ అధ్యాపకులను నిధులు లేమి కారణంతో విధుల నుంచి తొలగించడంతోపాటు గత మూడు నెలల నుంచి రావాల్సిన వేతన బకాయిలు చెల్లించలేదు. త్రిబుల్ ఐటీ లో సీటు సాధించాలనే లక్ష్యంతో ఇక్కడ చేరిన విద్యార్థులకు సెక్రెటరీ నిర్ణయం విద్యార్థులకు తీవ్రంగా నష్టపోయేలా చేసింది. కొత్తగా నియమించిన అధ్యాపకులు త్రిబుల్ ఐటీ సిలబస్ బోధించే సామర్థ్యం లేదు. మరో నాలుగు నెలల్లో ఐఐటీ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. విద్యార్థులు సబ్జెక్టులు రివిజన్ చేసుకునే సమయం ఇది. ఈ సమయం లో అనుభవం కలిగిన అధ్యాపకులు తొలగించడంతో ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యంత క్లిష్టతరంగా ఉన్న ఐఐటీ సబ్జెక్ట్ రివిజన్ సమయంలో అప్పటివరకు ఉన్న టీచర్ లను తొలగించడంతో నష్టపోయే ప్రమాదం ఉంది.మా జీవితాలను ప్రమాదంలో నెట్టివేసే నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు పనిచేసిన అధ్యాపకులు నియమించాలి.గతంలో ఇక్కడ వచ్చిన ఫలితాలు అధ్యాపకుల బోధనకు నిదర్శనం.

గౌలిదొడ్డి గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళ
Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *