ఆస్తి కాజేసేందుకు హత్య .. మరి ఇంత దారుణమా!

yaswanth

సినిమాలలో క్రైమ్ సీన్ తలపించే సన్నివేశం. జూదానికి బానిసై కోట్ల రూపాయల అప్పులు చేసిన ఓ ప్రబుద్ధుడు అత్తారింటి ఆస్తిపై కన్నేశాడు. వారింట్లో ఉన్నఒక్కగా నొక్క కొడుకును హత్య చేస్తే మొత్తం ఆస్థి సొంతం చేసుకోవచ్చని కుట్ర పన్నాడు. అనుకున్నదే తడవు హత్యకు పధక రచన చేశాడు.కసాయిగా మారి సొంత బామ్మర్దిని హత్య చేసేందుకు సుపారి ఇచ్చాడు. గచ్చిబౌలిలో హత్య చేసి కావలికి తరలించి హడావిడిగా దహన సంస్కార నిర్వహించేందుకు ఏర్పాటు చూస్తుండడంతో అనుమానం వచ్చిన అత్తమామలు గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించడంతో హత్యోదాంతం వెలుగులకు వచ్చింది. మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ ఆంజనేయులు కథన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

gogula srikanth

ఇటు గచ్చిబౌలి అటు కావలిలో కలకలం రేపుతున్న ఈ హత్య వివరాలివీ..కావాలి పట్టణంలోని ఉత్తర జనతాపేటలో నివసించే మద్దసాని ప్రకాశం వ్యాపారం చేస్తూ ఆర్థికంగా స్థిరపడ్డారు.  కుమార్తెను సత్యవోలు అగ్రహారానికి చెందిన శ్రీకాంత్ కి ఇచ్చి పెళ్లి చేశారు. అల్లుడు కొండాపూర్ రాఘవేంద్ర కాలనిలో పీజీ హాస్టళ్ల నిహిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ఎన్నికల్లో, తర్వాత  పందాలు ఆడి రూ.కోట్లు నష్టపోయాడు. అప్పులోళ్ల వేధింపులు తాళలేక అత్తింటి ఆస్తి కాజేయాలనే దురాలోచన చేశాడు.

తన హాస్టళ్ల నిర్వహణ కోసం బామర్దిని పంపించాలని,సొంత కుటుంబ సభ్యులు ఉంటే బాగుంటుందని అత్త మామను నమ్మించాడు. బీటెక్ చదివి ఖాళీగా ఉన్న తమ కుమారుడి యస్వంత్ కు
ఏదైనా ఉద్యోగంలో పెట్టాలని ఆలోచిస్తున్న కుటుంబ సభ్యులకుఅల్లుడి మాటలు నమ్మకం కలిగించాయి.తమ కుమారుడికిఅప్పగించేందుకు ప్రకాశం దంపతులు సిద్ధమయ్యారు. కొన్నాళ్లక్రితం గచ్చిబౌలి కి పంపారు. అప్పుడప్పుడూ అల్లుడు ఫోన్ చేసి.. మీ కుమారుడు గంజాయికి బానిసయ్యడాని అతడి స్నేహితులు ఇక్కడే ఉంటున్నారని చెప్పేవాడు. నాలుగు రోజుల క్రితం మరోసారి మరోసారి ఫోన్ చేసి చెప్పడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు.ఇంతలోనే మరో పిడుగుపాటు. వ్యసనాలకు బానిసైన మీ కుమారుడు ఉరేసుకున్నట్లు మృతదేహాన్ని కావలికి తీసుకొస్తున్నట్లు చెప్పాడు.
అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలని కోరాడు. మృతదేహంతో ఇంటికి చేరుకున్న అల్లుడు దహన సంస్కారాల కోసం హడావిడి చేయడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది.
మృతదేహంపై గాయాలుండటంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అత్తమామలు అతడి స్నేహితులపై ఆరా తీసేందుకు హైదరాబాద్ వెళ్లారు.అక్కడపోలీసులను ఆశ్రయించారు.వేగంగా స్పందించిన గచ్చిబౌలి పోలీసులు  సీసీ కెమెరాల ఫుటేజీ చూశారు. హత్యోదంతం రోజు నుంచి ఆటో డిలీట్ చేయడంతో ఎదురుగా ఉండే దుకాణంలో సీసీ ఫుటేజీ కోసం ప్రయత్నించారు. అసలు కథ వెలుగులోకి వచ్చింది. పోలీసుశాఖ ఆ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలో హత్య దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.

హత్య ఎలా జరిగిందంటే…

ఈ నెల 2న తన గదిలో నిద్రపోతున్న యశ్వంత్ ను సుఫారి తీసుకున్న అంజయ్య నగర్ కి చెందిన ఆనంద్ గచ్చిబౌలిలో నివాసం ఉంటున్న అంబటి వెంకటేశ్వర్లు పథకం ప్రకారం గదిలోకి వెళ్లారు. యశ్వంత్ కాళ్లు చేతులు పట్టుకొని చున్నీతో ఉరివేసి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫ్యాన్ కు చున్నీతో కట్టి మెడకు బిగించి ఫోటోలు తీసి కుటుంబ సభ్యులు పంపించారు. సొంత అల్లుడు చెప్పడంతో యశ్వంత్ కుటుంబ సభ్యులు ఆత్మహత్యగానే భావించారు. శవాన్ని భూములు పాతి పెట్టే సాంప్రదాయం ఉన్న ఆ కుటుంబంలో దహన సంస్కారాలు చేయాలని అల్లుడు శ్రీకాంత్ పట్టుబట్టడంతో అనుమానం పెరిగింది. తల్లిదండ్రులు ఈనెల 10న గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు అనుమానస్పదగా మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. హత్య చేసిన బాలాజీ మెన్స్ హాస్టల్ లో సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలు తొలగించడంతో పోలీసులు అనుమానం బలపడింది. మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో యశ్వంత్ హత్య వెలుగులోకి వచ్చింది.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *