ప్రమాదవశాత్తు నిర్మాణం లో ఉన్న భవనం పై నుండి పడి కార్మికుడు మృతి చెందిన సంఘటనచందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుల్ మోహర్ పార్క్ కాలనీ సమీపంలో నిర్మిస్తున్న క్యాండియార్ నిర్మాణ సంస్థ లో జరిగింది.బ్రతుకు దెరువు నిమిత్తం నగరానికి వచ్చి క్యాండియర్ అపార్ట్మెంట్ లో భవన నిర్మాణ కూలీగా వెస్ట్ బెంగాల్ కు చెందిన కైరుల్ మియ(34)పనిచేస్తున్నాడుపని చేస్తున్న క్రమంలో ప్రమాదవ శాత్తు భవనం 30 వ అంతస్తుపై నుండి కింద పడ్డ తీవ్ర గాయాల గురై ఘటన స్థలంలోనే మృతి చెందాడు. కార్మికులు చూస్తుండగానే పైనుంచి పడ్డ కైరుల్తీవ్ర రక్తస్రావం తో అక్కడికక్కడే మృతి చెందినట్లు చందానగర్ పోలీసులు చెప్పారు.నిర్మాణ దశలో ఉన్నఅపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కార్మికులకు నిర్మాణ సంస్థ ఏలాంటి సేఫ్టీ పరికరాలు ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. మృతి చెందిన కార్మికుని కుటుంబానికి న్యాయం చేయాలని నిర్మాణ సంస్థ పై చర్యలు చేపట్టాలని కార్మికులుఆందోళన నిర్వహించారు. కార్మికుల ఆందోళన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.తమ తోటి కార్మికుడు మృతి చెందడంతో ఆందోళన చేపట్టిన కార్మికులను పోలీసులు సముదాయించారు.ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో భారీగా పోలీసులను మోహరించారు.