
రాయదుర్గంలోని మై హోమ్ భూజ వెల్ఫేర్ అసోసియేషన్ (MHBWA)ఎన్నికలు హోరాహోరీగా సాగాయి.ఈ ఎన్నికలలో అభయ్ ప్యానల్ ఘన విజయం సాధించింది. అభయ్,ప్రగతి ప్యానెల్‌లతో పాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికలలో పాల్గొన్నారు.ఎన్నికలు స్నేహపూర్వక వాతావరణం లో సాగాయి.మై హోమ్ భూజ సంక్షేమ సంఘం (MHBWA) 2024-2026 కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి ప్రకటించారు.అధ్యక్ష పదవికి పోటీ చేసిన సంగారెడ్డి పైనడింపల్లి నాని రాజు 87 ఓట్లు ఆదిక్యంతో గెలుపొందారు.ఉపాధ్యక్ష పదవికి మహమ్మద్ గౌసుద్దీన్, మాధవి సిద్ధం,కె రాజేశ్వరి పోటి పడ్డారు. ప్రధాన కార్యదర్శిగా ఎన్ విద్య రెడ్డి,బోడ సుభాష్ చంద్రబోస్, ఆమన్ బైడ్ తలపడ్డారు.ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థుల తుది జాబితా ప్రకటించారు.
అధ్యక్షుడుగా డాక్టర్ నానిరాజు,వైస్ ప్రెసిడెంట్ మాధవి సిద్దం,ప్రధాన కార్యదర్శి గా ఎన్ విద్యారెడ్డి,సంయుక్త కార్యదర్శి గా డాక్టర్ ఓ కుమార్,,కోశాధికారిగా గౌరవ్ సోని సహాయ కోశాధికారిగా కళా తాటికొండ,కార్యవర్గ సభ్యులుగాడాక్టర్ ఎస్ రామకృష్ణారావు సంజయ్ సింఘ్వి,
డాక్టర్ టీవీ శ్రీనివాస్ జ్యోష్న ఎన్నికైనట్టు ప్రకటించారు. ఇందులో ప్రగతి ప్యానల్ కు చెందిన ఉపాధ్యక్ష,, జాయింట్ కోశాధికారి,ఒక కార్యవర్గ సభ్యుని పదవి కైవసం చేసుకున్నారు.గత ఎన్నికలతో పోల్చితే 4 శాతం ఓటింగ్ పెరిగింది.వచ్చే ఎన్నికల్లో ఈ-ఓటింగ్ విధానం అమలు చేయగలిగితే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంటుందని MHBWA మాజీ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ నైనేని అన్నారు.