ఐదు రోజులపాటు బాధితురాలిని తన ఇంటిలోనే డిజిటల్ అరెస్ట్

సైబర్ కేటుగాళ్లు బరితెగించారు.ఐదు రోజులపాటు బాధితురాలిని తన ఇంటిలోనే డిజిటల్ అరెస్ట్ చేశారు.స్కైప్, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా నిరంతరం నిఘాలో ఉంచారు. ఆమె కదలికలు గమనిస్తూ వేధింపులు పాల్పడ్డారు. తనకు తానుగా గృహ గృహ నిర్బంధం చేసుకొనేలా భయభ్రాంతులకు గురి చేశారు. సైబర్ నేరాల చరిత్రలోనే ఈ తరహా మోసం సంచలనం సృష్టిస్తుంది. సైబర్ మోసానికి పాల్పడిన నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కేటుగాళ్ళు శుక్ల, కపిల్ కుమార్ లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.బాధితురాలికి ఆటోమేటిక్ కాల్ రావడంతో లిఫ్ట్ చేశారు. తాను ఢిల్లీలోని ఆర్ సి పురం పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ గా పరిచయ చేసుకుని తన పేరు గౌరవ్ శుక్లా మాట్లాడుతున్నానంటూ చెప్పాడు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతూ 25 లక్షలు మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని, అనధికార లావాదేవీలు జరిగాయని బెదిరించాడు. బాధితురాలు బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పి ఈ ఖాతా నెంబర్ ద్వారా మనీలాండరింగ్ పాల్పడ్డట్టు బాధితురాలని బెదిరించారు. ఆ తర్వాత డిసిపి రాజేష్ డియో మాట్లాడతారంటూ చెప్పారు. 24 గంటలు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామంటూ స్కైప్ ద్వారా నిఘా పెట్టారు. స్కైప్, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఐదు రోజులు పాటు గృహనిర్బంధం చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉండటంతో సైబర్ కేటుగాళ్ళు మరింత రెచ్చిపోయారు. కేసు నుంచి తప్పించాలంటే తమ డబ్బులకు చెల్లించాలని భయభ్రాంతులకు గురి చేశారు. సైబర్ కేటుగాళ్లు బాధితురాలి అన్ని రకాల బ్యాంకు ఖాతా వివరాలు తెలుసు కున్నారు.1.37 కోట్లు తమ ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఆటోమేటిక్ గా వచ్చే కాల్స్ ని ఎత్తడం ద్వారా బాధితురాలు సర్వంకోల్పోయారు.ఆయాచితంగా వచ్చే కాల్స్ కి స్పందించవద్దని ఎవరికి డబ్బులు బదిలీ చేయొద్దని కోరారు.చట్టం అమలు చేసే పోలీస్ అధికారులు ఎవరిని లంచాలు అడగరని డిజిటల్ అరెస్ట్ లో ఉండమని ఎవరిని ఆదేశించారని చెప్పారు.ఈ తరహా వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసుల సమాచారం ఇవ్వాలని కోరారు.

ఆయాచితంగా వచ్చే కాల్స్ కి స్పందించవద్దని

67 ఏళ్ల బాధితురాలి  డిజిటల్ అరెస్ట్ చేసి 1.37 కోట్లు కాజేసినసిన సైబర్ కేటుగాలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన సెప్టెంబరు 27 సైబరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో బ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.సెప్టెంబర్ 21 తనకు +91 9290xxxx861 నుండి ఆటోమేటెడ్ కాల్ వచ్చిందని బాధితురాలి పేర్కొన్నారు. తన ఆధార్ ఐడితో అనుసంధానం చేసిన సిమ్ కార్డ్ దుర్వినియోగం చేసినట్లు బెదిరించారు.ఈ మేరకు ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో కేసు నమోదైందని బెదిరింపు కాల్ రావడంతో  కంగారుపడ్డాడు.ఇంతలోనే అతను తనను తాను ముంబై క్రైమ్ డివిజన్ పోలీస్ అధికారిగా చెబుతూ ఆధార్ ఐడితో ఐసిఐసిఐ బ్యాంకులో తెరిచిన ఖాతా ద్వారా అంతర్జాతీయ మనీలాండరింగ్ చేసినట్లు బెదిరించాడు.తర్వాత ఫోన్ చేసిన వ్యక్తి రూ. 1.37 కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయని బ్యాంకు ఖాతా వివరాలు చెప్పడంతో మరింత భయపడ్డారు.సంపాదన చట్టబద్ధమైనదిగా నిర్ధారించడానికి సిబిఐ ఖాతాలోకి. ఫెమా పిఎంఎల్‌ఎ కింద మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉన్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లెటర్‌హెడ్‌పై అరెస్ట్ ఆర్డర్ పంపడం ద్వారా కేటుగాళ్ళు భయపెట్టారు. గత్యంతరం లేక మోసగాళ్ల ఖాతాల్లోకి నగదు మళ్ళించారు.ఆ తర్వాత జరిగిన మోసం తెలుసుకొని సైబర్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేయడంతో జరిగిన మోస వెలుగులోకి వచ్చింది.వేగంగా స్పందించినఇన్‌స్పెక్టర్ కె. రామి రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు.లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలుగా నటించి మోసపూరిత కార్యకలాపాలు మనీలాండరింగ్ ఆరోపణలపై బాధితురాలిని బెదిరించి మోసం చేశారని వెల్లడించారు.బాధితురాలిని మోసం చేసిన సురేష్ కుమార్ బాబులాల్ అరెస్ట్ చేశారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *