
వివాహం జరిగి నాలుగు నెలలు. మంచి ఉద్యోగంచక్కటి జీవితం. హాయిగా సాగిపోవలసిన కొత్త జంట కాపురం బీటలు వారింది .అప్పుడే భర్త వేధింపులు. ఇరువురి మధ్య మనస్పర్ధలు. ఆనందంగా సాగిపోవాల్సిన వైవాహిక జీవితం చావు కోసం కొత్తదారని వెతుక్కుంది.ఆన్లైన్లో కలుపు మొక్కలు చంపే రసాయనాలు కొనుగోలు చేసి వివాహిత ఆత్మహత్య చేసుకుంది.
వివాహిత ఆన్లైన్ లో విషం ఆర్డర్ చేసి తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మియాపూర్ లో కలకలం సృష్టించింది. భార్య భర్తల మధ్య కలహాలుసాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య కారణమని పోలీసులు భావిస్తున్నారు.మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని మాతృశ్రీ నగర్లో విషాదకర సంఘటన జరిగింది.భర్త వేధింపులు, మనస్పర్థలు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాగలక్ష్మి స్వస్థలం ఏలూరు జిల్లా చింతపూర్ గ్రామం. నగరంలో ఒక పరిశ్రమలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు.4 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్ తో నాగలక్ష్మి కి వివాహం జరివింది.ఇంతలోనేమాతృశ్రీ నగర్ లోని తన ప్లాట్ లో రసాయన మందు తాగి అపస్మారక స్థితిలో పడి ఉండగా అపార్ట్మెంట్ వాసులు గమనించి సమీపంలోని ఆసుపత్రిక తరలించారు. చికిత్స పొందుతూ నాగలక్ష్మి మృతి చెందారు. ఈ మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు