ప్రతి ఏటా ముక్కు పిండి పన్నులు వసూలు చేసే అమీన్పూర్ మున్సిపల్ అధికారులు ఆయా కాలనీలకు మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంటుంది. ప్రభుత్వ భూములు కబ్జా చేసి ఇల్లు నిర్మించుకున్న చోట భేషరతుగా రోడ్లు నిర్మిస్తున్న అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న కాలనీ వాసుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే… మౌలిక వసతులు కల్పించమని ఏళ్ల తరబడి విసిగి వేసారి పోయి సొంత ధనంతో రోడ్లు నిర్మించుకుంటే…. ఆ రోడ్లకు మేమే ధనం వెచ్చించాం కావున టాక్స్ కట్టమంటూ ఎదురు తిరిగితే.. ఆ తప్పిదం ఎవరిది అవుతుంది. మరో వైపు ప్రతి ఏటా టాక్స్ లు కడుతున్న కాలని వాసులు వసతులు కల్పించమని డిమాండ్ చేయలేని,అధికారులను ప్రశ్నించలేనిప్రభుత్వ వ్యవస్థలను మేల్కొలపలేని పరిస్థితులకు దిగజారిపోయారా ? చైతన్యం లోపించిందా?అంటే అవుననే సమాధానం సమాధానం వస్తుంది.
బీరంగూడ కె ఎస్ ఆర్ కాలనీలో సరైన రోడ్లు,డ్రైనేజీ వ్యవస్థ లేదు.. రోడ్లు పై భారీ గుంతలు ఏర్పడి అద్వాన్నంగా మారాయి. ఈ రోడ్లపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది. సుమారు 235 కుటుంబాలు నివాసం ఉంటున్న ఈ కాలని నుంచి ప్రతి ఏటా రెండున్నర కోట్ల పైబడి అమీన్పూర్ మున్సిపాలిటీకి ఇంటి పన్నుల రూపేణ చెల్లిస్తున్నారు. సకాలంలో పనులు చెల్లించమని హడావిడి చేస్తున్న అధికారులు మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టడం లేదు. దీంతో విసిగి వేసారి పోయిన కాలనీవాసులు సొంత డబ్బులతో రోడ్ల నిర్మించుకుంటున్నారు. కాలనీ ప్రజలు తీసుకున్న ఈ నిర్ణయం పన్నులు తీసుకుంటున్న మున్సిపల్ అధికారులకు తల వంపులుగానే భావించాలి.. కాలని వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే అభినందించాల్సిందే కానీ.. పన్నులు వసూలు చేసుకొని ముఖం చాటేస్తున్న మున్సిపాలిటీ అధికారులు, గత పాలకమండలి నిర్లక్ష్యం కారణమని చెప్పాలి.సొంత డబ్బులతో రోడ్లు నిర్మించుకోవడం అంటే ప్రభుత్వ తీరుపై కాలని వాసులు నిరసన వ్యక్తం చేయడమే.పలుమార్లు మున్సిపల్ కమిషనర్ జ్యోతి రెడ్డి నీ కలిసి వినతిపత్రం సమర్పించారు.మౌలిక వసతులు కల్పించాలని పలుమార్లు అప్పటి మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, కౌన్సిలర్ సయ్యద్ మున్నా నో కలిసి విజ్ఞప్తి చేశారు.అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా రహదారి నిర్మాణం జరగలేదు.. ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న మౌలిక వసతులు కల్పించ లేకపోతే తలవంపులు గా భావించాల్సి ఉంటుందని ఈ విషయంపై మున్సిపల్ అధికారులుపూర్తిగా విఫలమయ్యారు. 20 ఏళ్ల క్రితం ఏర్పడ్డ ఈ కాలనీలో ఇప్పటికి సరైన రోడ్లు లేవు.ఇతర మౌళిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేసేది ఏమీ లేక ఇంటింటికి డబ్బులు వసూలు చేసుకుని రోడ్లు నిర్మించుకుంటున్నారు. ఈ రోడ్లు తాము సొంత నిధులతో నిర్మించుకున్నందున ట్యాక్స్ కట్టమని ప్రభుత్వానికి ఎదురు తిరిగితే దాని పర్యవసానాలు విపరీతంగా ఉంటాయని కాలనీ వాసుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..