ఖ‌జానా జ్యువెల‌రీ దుకాణం దోపిడీ దొంగ‌ల అరెస్ట్.. మైండ్ బ్లోయింగ్ స్కెచ్ వేసిన పోలీసులు

చందాన‌గ‌ర్‌లోని ఖ‌జానా జ్యువెల‌రీ దుకాణంలో దోపిడీ పాల్పడ్డ దొంగ‌లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.పట్టపగలు, ప్రధాన రహదారి పక్కనగలు దుకాణంలో జరిగిన చోరీ సంచలనంగా మారింది.పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.సాంకేతికతను ఉపయోగించుకుని చోరీకి కేసును ఛేదించారు.ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు.మరో ఐదుగురు దొంగలు పరారీలో ఉన్నారు.ఈ చోరీ కేసు వివ‌రాల‌ను మాదాపూర్ డీసీపీ వినీత్ మీడియాకు వెల్ల‌డించారు.ఖజానా జ్యువెల‌రీ దుకాణంలో చోరీకి పాల్ప‌డ్డ నిందితులంతా బీహార్‌కు చెందిన వారే. గ‌త రెండేండ్లుగా వీరు హైద‌రాబాద్‌లో నివాసం ఉంటూ కూలీ ప‌నులు చేస్తున్నారు. ఇక ఈజీగా డ‌బ్బు సంపాదించాల‌నే ఉద్దేశంతో చోరీల బాట ప‌ట్టారు. భారీ దోపిడీకి పన్నాగం పన్నారు.చందాన‌గ‌ర్ ఖ‌జానా జ్యువెల‌రీ దుకాణం వ‌ద్ద 20 రోజుల పాటు రెక్కీ నిర్వ‌హించారు.నిందితులు ఏడుగురు కూడా బైక్‌పై వ‌చ్చి బైక్‌ల‌పైనే పారిపోయారు.లాకర్ తెరవడం ఆలస్యం కావడంతో భారీ దోపిడీ కళ్లెం పడింది.10 కిలోల వెండి ఆభరణాలు దొంగ‌లు అప‌హ‌రించారు. బంగారంగా భావించి బంగారం పూత పూసిన వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఈ బిహార్‌ ముఠా హైదరాబాద్‌లో చేసిన తొలి చోరీ ఇది. గతంలో కోల్‌కతా, బిహార్‌, oకర్ణాటకలో దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించామ‌ని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.

హైదరాబాద్ లో మకాం దోపిడీకి పన్నాగం

ముసుగు ధరించిన ఆరుగురు దోపిడి దొంగలు ఖజానా జ్యువలరీ లో ప్రవేశించి డిప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ పై కాల్పులు జరిపారు.మరో మేనేజర్ రెండో తాళం మర్చిపోవడంతో దానిని తెచ్చేందుకు ఇంటికి వెళ్లాడు.ఇంతలోనే డెకయిట్ గ్యాంగ్ నగలు దుకాణంలోకి ప్రవేశించారు.లాకర్ తెరిచే అవకాశం లేకపోవడంతో బంగారం పూత పూసిన వెండి పది కిలోలు దోచుకెళ్లారు.ఈ కాల్పులు ఘటనలో గాయపడ్డ సతీష్ కుమార్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు .ఇందులో 900 గ్రాముల వెండి వస్తువులు సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు .ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు వ్యక్తులు పాల్గొన్నారు .అరెస్ట్ అయినవారిలో ఆసీస్ కుమార్, దీపక్ కుమార్ సాహూ బీహార్ రాష్ట్రంలోని కరణ్ జిల్లాకు చెందిన వారు గా గుర్తించారు .ఇద్దరూ గతం లో వివిధ నేరాల్లో అరెస్ట్ అయ్యారు.హైదరాబాద్ లో దోపిడీ చేయాలని అనుకున్నారు.మారణాయుధాలు ధరించి బంగారం దుకాణంలో దోపిడీ చేయాలని ప్లాన్ చేశారు. దీపక్ కుమార్ సాహు జీడిమెట్లలోని ఆస్ బెస్టాస్ కాలనీలో ఇల్లు అద్దెకి తీసుకొని నివాసం ఉంటున్నారడు.మిగతా ఆరు మంది కలిసిరెండు సెకండ్ హ్యాండ్ బైకులు కొనుగోలు చేసి దోపిడీకి రెక్కీ నిర్వహించారు.చందానగర్ ఖజానా జ్యువెలర్స్ దోపిడీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు.బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసి దోపిడీకి పాల్పడ్డారు .నిందితుడు ఆసీస్ కుమార్ సింగ్ ను మహారాష్ట్రలో పోలీసులరెస్ట్ చేశారు .ఇతను ఇచ్చిన సమాచారం ఆధారంగా దీపక్ కుమార్ అరెస్ట్ చేశారు.జ్యువలరీ షాప్ ల వద్ద తగినంత భద్రత లేకపోవడంతో ఈ ఘటన జరిగినట్లు నిర్ధారించామన్నారు. దొంగలు ఎవరైనా ప్రవేశిస్తే ఆ సమాచారం సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలి చేలా అలారం వ్యవస్థ అందుబాటులో ఉంచాలని డిసిపి సూచించారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *