వారంలో ఒకటో రెండో సార్లు సమయానికి ట్రైన్ రాకపోతే వివిధ కారణాలతో ఆలస్యం అయిందని అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లుగా చిత్తాపూర్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే చిత్తపూర్ ఎక్స్ ప్రెస్ ప్రతిరోజు గంట, రెండు గంటలు ఆలస్యంగా నడపడం పరిపాటిగా మారింది.దీంతో ఈ ట్రైన్ నమ్ముకున్న ప్రయాణికులు ఇబ్బందులు గురవుతున్నారు.రైలు ఖచ్చితమైన వేళలు పాటించాలని కోరుతూ ప్రయాణికులు లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ ముందు ఆందోళన నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం 7:30 కి లింగంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకోవలసిన ట్రైన్ ఆలస్యంగా నడుపుతుండడంతో ఉద్యోగాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. సకాలంలో కార్యాలయాలకు చేరుకోలేక తీవ్రపొందులు ఎదుర్కొంటున్నమని ఆగ్రహ వ్యక్తం చేశారు.వారంతా లింగంపల్లి సమీపంలో సిగ్నల్ వద్ద లోకొపైలెట్ ట్రైన్ నిలిపివేయడంతో ప్రయాణికులు మెరుపువేగంతో పట్టాలపై ధర్నా నిర్వహించారు. ఖచ్చితమైన వేళలు పాటించి ట్రైన్ నడపాలని డిమాండ్ చేశారు. ఆందోళన నిర్వహించిన ప్రయాణికులను లింగంపల్లి రైల్వే పోలీసులు స్టేషన్ కు తరలించారు.11 మంది ఆందోళనకారులపై కేసు నమోదు చేశారు. ట్రైన్ సమయపాలన పాటించాలని ప్రయాణికులు నిరసన వ్యక్తం చేస్తే రైల్వే అధికారులు కేసులు నమోదు చేయడం పట్ల సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. వినతిపత్రం సమర్పించేందుకు రావాలని ఆహ్వానించిన అధికారులు కేసుల నమోదు చేయడం ధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లుగా సమయానికి రైలు నడపలేని ఆ శాఖ అధికారులు నిరసన చేపట్టిన వారిని ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరించడం విడ్డురంగా ఉంటున్నారు.