
పబ్బులు గబ్బు రేపుతున్నాయి. అక్రమ సంపాదన కోసం పబ్ యజమానులు గలీజ్ దందాకు తెరలేపుతున్నారు. ఇందుకోసం డేటింగ్ యాప్ లను వాడుకుంటూ యువతులతో అమాయకులనువలవేస్తూ నిలువెల్లా మోసం చేస్తున్నారు. ఇలా చేసిన ఓ పబ్బును మూసివేసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.సంబంధిత వ్యక్తులపైన సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాదాపూర్ డిసిపి వినీత్ కుమార్ విలేకరు సమావేశంలో వివరాలు వెల్లడించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే….మాదాపూర్ ఓ మాల్ లో మోష్ పబ్ నిర్వాహకులు చేస్తున్న మోసానికి సంబంధించి సమాచారం అందింది.ఆన్లైన్లో డేటింగ్ యాప్ లతో అందమైన యువతుల ప్రొఫైల్ తో కస్టమర్స్ ని ఆకర్షిస్తున్నారు.. ఆ తరువాత పబ్ లకు క్టమర్లను తీసుకొస్తున్నారు. ఉద్యోగాల వేటలో ఉండే అమ్మాయిల ప్రొఫైల్ తీసుకొని వారిచేత ఈ మోసాలు చేయిస్తున్నారు..ముందుగా అమ్మాయిల మారు పేరుతో డేటింగ్ యాప్ లో ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు..అబ్బాయిలే ఈ యాప్ లో అమ్మాయి మాదిరిగానే సూరజ్ కుమార్ అనే నిందితుడు చాట్ చేస్తాడు.ఢిల్లీకి చెందిన ఆరుగురు ఈ ముఠాలో కీలకం. నిందితులు ఢిల్లీ లో నైట్ క్లబ్ పేరుతో పబ్బును రన్ చేస్తున్నారు.ముందుగా టీ తాగేందుకు కేఫ్ కి రమ్మంటారు. ఇరువురూ కలిసి అక్కడ కాఫీ తాగుతారు.ఆ తర్వాత మాయమాటలు చెప్పి పబ్బుకు తీసుకొని వెళ్తారు.పబ్బులోకి తీసుకువచ్చిన తర్వాత డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెనూ ఇస్తారు..పబ్ కు వచ్చే వారినుంచి ఎక్కువ బిల్స్ వేస్తున్నారు. బిల్ చెల్లించే సమయానికి అమ్మాయిలు పరారవుతున్నారు.దీనిపై బాధితులు పోలీసులకు పిర్యాదు చేయడంతో నిర్వాహకులు చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది .ఢిల్లీకి చెందిన ఆరుగురు ఈ ముఠాలో కీలకము అని గుర్తించాం.ఢిల్లీ, బెంగళూరులో ఈ తరహా మోసాలకు పాల్పడ్డారు. నాగపూర్ లో కూడా మోసం చేయాలనుకున్నారు.అంతలోనే సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
పబ్ లో ఎంజాయ్ చేద్దాం… ఓయో రూమ్ కు పోదాం
డేటింగ్ యాప్ లో పరిచయమైన యువకులతో ముందుగా చాట్ చేస్తారు.తరువాత మాట కలుపుతారు. కాఫీ తాగుతూ మాట్లాడదామని హోటల్ కి పిలిపిస్తారు.అక్కడకువచ్చేవారితో పబ్ కు వెళ్లి ఎంజాయ్ చేద్దాం అంటూ కైపు ఎక్కిస్తారు. అక్కడికి వచ్చాక ఖరీదైన మందు తాగుదామంటూ లిక్కర్ కౌంటర్ వద్దకు వెళ్లి మద్యం తాగుతారు.ఈ అమ్మాయిలతో వచ్చేవారికి సపరేట్ బిల్లింగ్ ఉంటుంది.ఈ బిల్లులో అమ్మాయితో పాటు ఆర్గనైజ్,పబ్ ఓనర్ మొత్తం ముగ్గురు వాటాలు పంచుకుంటారు
డేటింగ్ యాప్ లపై నిఘా
డేటింగ్ యాప్లలో ఉండే ప్రొఫైల్లు సంబంధిత వ్యక్తులవి అయి ఉండాలి.తప్పుగా ఉంటే యాప్ నిర్వాహకుల పై చర్యలు తీసుకుంటాము.ఈ మేరకు నోటీసులు జారిచేస్తాం.ప్రజలకు తప్పుదారి పట్టించే విధంగా ప్రకటనలు ఉండకూడదు.
పదిమంది ముఠా అరెస్ట్
ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం పది మందిని అరెస్టు చేశాము.డీల్లీకి చెందిన ఏడుగురు ముఠా సభ్యులతో పాటు పబ్ కు చెందిన ముగ్గురు యజమానులు, మేనేజర్ ను అరెస్టు చేశాము.ఢిల్లీకి చెందిన ఆకాష్ కుమార్, అక్షత్, సూరజ్ కుమార్, తరుణ్ ,శివరాజ్ నాయక్, మోహిత్ కుమార్, పబ్ ఓనర్ తరుణ్, ఘంటా జగదీష్, నవోదయ లపు అరెస్టు చేస్తున్నాము.నాగపూర్ లో మోసం చేయాలని అనుకున్నారు..అంత లోపు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
గోవా కల్చర్ హైదరాబాద్ కు దిగుమతి
గోవా లో ఉన్న పబ్ లలోకి ప్రవేశిస్తే ప్రధాన గేట్ వద్ద ఆకర్షణీయమైన అలంకరణలో యువతులు కాపుకాసి ఉంటారు.యువకులుపబ్ లోపలికి వెళ్ళిన వెంటనే మాట కలిపి లిక్కర్ విక్రయించే కౌంటర్ వద్దకు తీసుకువెళ్తారు.యువకుని ప్రమేయం లేకుండానే మద్యం తాగుతారు.మద్యం సరఫరా చేసే వ్యక్తి బిల్లు చేతులో పెడితే బిత్తురు పోవడం యువకుని వంతు అవుతుంది.గత్యంతరం లేక బిల్లు చెల్లించి బైటకి వెళ్ళాలి.కుదరదంటే ఆప్పటి పరిస్థితులు వేరేరకంగా ఉంటాయని మోసపోయిన బాధితులు వాపోతున్నారు.అక్కడ సంస్కృతి హైదరాబాద్ కి రావడం సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతుంది.
వేలుగులోకి వచ్చింది ఇలా
ఇటీవల చాలా మంది అబ్బాయిలు.. అమ్మాయిల మోజులో పడి డేటింగ్ యాప్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు.. అయితే దాన్నే అలుసుగా తీసుకున్న కొంతమంది పబ్ ఓనర్స్ అమ్మాయిలతో కలిసి కొత్త మోసానికి తెరలేపారు.అబ్బాయికి రితికా అనే అమ్మాయి పరిచయం అయ్యింది.. పరిచయం అయిన మరుసటి రోజే అబ్బాయిని కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రావాలని కోరింది..తర్వాత రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద కలుసు కున్నారు.. అయితే ఆ అమ్మాయి పక్కనే ఉన్న గ్యాలేరియా మాల్ లోని మోష్ క్లబ్ కి వెళ్దామని అతడిని అడిగింది.. అందుకు అంగీకరించిన అతడు అలాగే తనని తీసుకు వెళ్లాడు.అతడిని క్లబ్ లోకి తీసుకు వెళ్లిన ఆమె తియ్యని మాటలు చెప్పి కరిదైన మద్యం ఆర్డర్ చేసి 40505 రూపాయిలు బిల్ చేసింది.మోసపోయిన అబ్బాయి తర్వాత అనుమానం వచ్చి క్లబ్ యొక్క గూగుల్ రివ్యూస్ చూడగా ఇలాగే మోస పోయిన వేరే యూసర్ రాసిన రివ్యూ చూడగా.. క్లబ్ వాళ్లు అమ్మాయిలతో కలిసి చేస్తున్న మోసమని అర్థం చేసుకున్నాడుఇలాగే ఆ అమ్మాయి, పబ్ చేతిలో చాలా మంది మోసపోయి వేల రూపాయలు నష్ట పోయారు.