బలమైన ప్రతిపక్షాన్ని ఎన్నుకొనే చైతన్యం కావాలి

We need the consciousness to elect a strong opposition
ఎస్ ఆర్ వేమన

నిస్సందేహంగా… చంద్రబాబు అంత తెలివి తక్కువ వాడా? ఈ సారి అధికారం తప్పనిసరి. అందుకే అన్ని దారులూ వాడుకొన్నారు. ఈ అవకాశం తీసుకొని తన కీర్తి ప్రతిష్టలు పెంచుకొని లోకేష్ కి భవిష్యత్ నిర్మిస్తాడు. ఆదిపత్య కుల పార్టీల రాజకీయ చదరంగంలో బహుజనులు తన్మయం చెందవలసిన అవసరం లేదు.అది మోడీ, రాహుల్ గాంధీ, చంద్రబాబు, జగన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఎవరైనా కావచ్చు. _ప్రజా ప్రయోజనార్థం అంటూ వాళ్ళు ఏమి చేసినా వాళ్ళ వర్గ- వర్ణ స్వార్థం కొరకే తప్ప సామాన్యులకు ఒరిగేది ఏమీ ఉండదు.భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నది_అనే అంకెల గారడి ప్రగాల్బాల వెనక ‘జిడిపి లెక్కలే తప్ప సామాన్యుని జీవన ప్రమాణ ఎదుగుదల లెక్కలు లేవు కదా!పౌర సమాజం ఇది గమనించాలి, వాళ్ల మడతలను, వాళ్ళ గజిబిజి రాజకీయ అడుగులను డీ కోడ్ చేయడం ప్రతి పౌరుడు తెలుసుకొని తదనుగుణంగా ఈ దశలో చైతన్యంతో వాళ్ళను
దండించగలిగితే ఈ సమాజానికి కొంత ప్రయోజనం ఉంటుంది.గుడ్డెద్దు చేలో పడినట్టు…అటు కాంగ్రెస్ కో ఇటు బిజెపి కో లెదూ వెరే మరో ఆధిపత్యకుల పార్టీకి మానసిక అనుచరులుగా మనం మారడం వలన సమాజానికి ఏ రకమైన మేలు జరగదు.80 – 85% గా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజ ప్రయోజనార్థం వాళ్ళ నాయకత్వంలోనే దేశీయ రాజకీయ సిద్ధాంత పునాదిగా ఏర్పడే రాజకీయ పార్టీలను అధికారంలొ కూర్చోబెట్టగలిగితే వాళ్లు ఈ రాజ్యాంగం ప్రతిపాదించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సాంస్కృతిక సమానతకై కృషి చేస్తేనే సామాజ వికాసం జరుగుతుంది.దానికి అనుక్షణం, ఆధిపత్య కుల పాలక పార్టీల ప్రతి రాజకీయ పరిణామాన్ని నిశితంగా అర్థం చేసుకొని decode చేసుకుంటూ 80 – 85% గా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమాజానికి కలిగే లాభనష్టాలను అంచనా వేయాలి.పొత్తు ఎందుకు పెట్టుకొన్నారు అంటే ఏ ఛాన్స్ వదులుకోకూడదు కాబట్టి. ఇంక ఈ మెజారిటీ లు చూస్తే దళితులు,బీసీ లు కూడా వుచితాల ప్రభావం నుండి బయట పడి నిశ్శబ్ద ఓటింగ్ చేశారు. కొందరు కరుడు గట్టిన భక్తులు మాత్రమే అధికార పార్టీ కి ఓటు చేశారు. అదేవిధంగా యువత మోడీ భ్రమ నుండి బయట పడటం కూడ బిజెపి తిరోగమనం బాట లో పడింది. పాజిటివ్ దృష్టి తో ఇది నా ఆలోచన.మీరన్నట్టు, పొత్తు రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ‘ఒక పార్టీ ఒంటెద్దు పాలన, పార్టీ అధినేత ఏకపక్ష పాలన కంటే కచ్చితంగా మెరుగైనదే.పౌరు సమాజం ఒక పార్టీని అధికార పీఠంలో కూర్చోబెట్టడమే కాకుండా, బలమైన ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకోనే ఓటు చైతన్యాన్ని సమకూర్చుకోవాలి. ప్రజా సంఘాలు ఆ దిశగా కృషి చేయడం ప్రజాస్వామ్యంలో అత్యవసరం.
ఎస్ ఆర్ వేమన 9494 48 4242

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *