పేద ప్రజలకు వైద్యం అందుబాటులో తెచ్చేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసింది. ఈ దవాఖానాల్లో డాక్టర్ తో పాటు సపోర్టింగ్ స్టాప్ ను నియమించింది. ఇక్కడికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్యం తో పాటు వివిధ రకాల సేవలు అందిస్తున్నారు. అంతా బాగానే ఉన్నా… రోగులకు సేవలందిస్తున్న వైద్య సిబ్బందికి నెల నెల వేతనాలు అందడం లేదు. గత నాలుగు నెలల నుంచి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మార్చి నెల నుంచి నాలుగు నెలల వేతనాలు విడుదల చేయలేదు. దీంతో కుటుంబ పోషణ భారమై ఇంటి అద్దెలు, స్కూల్ పిల్లల ఫీజులు ఇతర ఖర్చులకు భారంగా మారింది.కొంతమంది ఆర్ధిక ఇబ్బందులు నుంచీ బయటపడేందుకు ప్రైవేటుగా విధులు నిర్వహించి వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మరి కొంతమంది ఎప్పుడు వేతనాలు వస్తాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బస్తి తవఖానలో ఉద్యోగం వస్తే సంబరపడ్డాను. అనారోగ్యంతో మంచాన పడ్డ భర్తని చదువుకుంటున్న పిల్లలకి ఆసరాగా ఉంటుందని ఉద్యోగంలో చేరాను. నెల నెల రావలసిన వేతనాలు అందుకు ఇబ్బందులు పడుతున్నానని చందానగర్ లో పనిచేసే ఓ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నో ప్రయోజనాలు…
ప్రతిరోజు అనారోగ్య సమస్యలతో బస్తీ దవాఖానకు వచ్చే రోగులకు వైద్య సేవలు అందించడంతోపాటు ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకుపరీక్షలు ,చిన్నారులకు టీకాలు తోపాటు సీజనల్ వ్యాధులకు వైద్య సహాయం అందిస్తున్నారు. సుగర్, థైరాయిడ్ లాంటి రోగాలకు రక్త నమూనాల సేకరణ ,టెలి కన్సల్టేషన్ ఏర్పాటు వీడియో కాలింగ్ ద్వారా నిపుణులైన వైద్యులతో రోగులకు వైద్య సహాయం అందిస్తున్నారు. ఎంతో కీలకమైన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందకపోవడంతో విధులపై సరైన శ్రద్ధ పెట్టలేకపోతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమేవేతనాల విడుదలలో జాప్యం
నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంతో పాటు ఇతర ఖర్చులకు నిధులు విడుదల చేయాలి.ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ప్రతినెల ఉద్యోగుల వేతనాలు బడ్జెట్ ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్లే వేతనాలు సకాలంలో అందించలేకపోతున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తారు. సంబంధిత శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించి మే నెలలోనే వేతనాలు బడ్జెట్ రూపొందించిన నిధులు విడుదలకు చొరవ చూపాలని కోరుతున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యమేవేతనాల విడుదలకు జాప్యం
నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ పనిచేసే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడంతో పాటు ఇతర ఖర్చులకు నిధులు విడుదల చేయాలి.ఇందుకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ ప్రతినెల ఉద్యోగుల వేతనాలు బడ్జెట్ ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వం నిధులు విడుదల విడుదల చేయకపోవడం వల్లే వేతనాలు సకాలంలో అందించలేకపోతున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తారు. సంబంధిత శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించి చర్యలు తీసుకుంటే నెల నెల వేతనాలు పొందే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. దానికి తోడు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ పేరుతో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాల పోస్ట్లు ఖాళీలు భర్తీ చేయాలని తెలంగాణ కాంట్రాక్ట్ ఎంపీపీ ఎస్ డాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్ భరత్ కుమార్ ప్రభుత్వ విజ్ఞప్తి చేశారు.