
ఇళ్ల మధ్య సెల్ ఫోన్ల టవర్ పెట్టొద్దు అంటూ కే ఎస్ ఆర్ కాలనీవాసులు కదం తొక్కారు. ప్ల కార్డులు ప్రదర్శించి నిరసన తెలియజేశారు. ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపించే సెల్ఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తే తీవ్ర దుష్పరిణామాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. టవర్లు ఏర్పాటు చేయుకుండా అడ్డుకోవాలని కోరుతూ అమీన్పూర్ మున్సిపల్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.పోలీసులను కలిసి ఫిర్యాదు చేసినట్లు కాలని అధ్యక్షుడు భాస్కర్, కాలని వాసి కందుల గణేష్ చెప్పారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. సెల్ టవర్ యాజమాన్యం తమ స్వలాభం కోసం కాలనవాసులు ప్రాణాలతో చెలగాటమాడోద్దని హెచ్చరించారు. కాలనీవాసుల మనోభావాలు గుర్తించ కుండా సెల్ టవర్ నిర్వాహకులు ఏకపక్షంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు . నిరసన కార్యక్రమం లో కాలనీవాసులు, మహిళలు విద్యార్థులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లక్ష్మీనారాయణ,ప్రభాకర్ రెడ్డి, రూపక్ తదితరలు పాల్గొన్నారు.
సెల్ ఫోన్ టవర్లతో రేడియేషన్ ఉంటుందా?
సెల్ టవర్ల నుండి వెలువడే రేడియేషన్ వల్ల కలిగే నష్టాలు పై నిర్దిష్టమైన సమాచారం అందుబాటులో లేదు.కొన్ని అధ్యయనాలు ఆరోగ్య సమస్యలు కలిగిస్తాయని నచెబుతున్నారు.సెల్ టవర్ల నుండి వెలువడే రేడియేషన్ స్థాయిలు పై ఎలాంటి స్పష్టత లేదు.ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన భద్రతా పరిమితులకు లోబడే టవర్లు ఉండాలి. సెల్ ఫోన్లు, సెల్ ఫోన్ టవర్లు నుండి వచ్చే రేడియోఫ్రీక్వెన్సీ (RF) రేడియేషన్ క్యాన్సర్‌కు కారణమవుతుందా లేదా అనే దానిపై అమెరికన్ క్యాన్సర్ సొసైటీ కూడా నిర్ధారించలేదు.కొన్ని అధ్యయనాలు అధిక రేడియేషన్ స్థాయిలు కలిగి ఉంటాయని దీంతో తలనొప్పి, అలసట, చర్మ సమస్యలు,ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నాయి.క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉందని,గుండెజబ్బులు,తలనొప్పి,నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి నరాల సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్న సరైన స్పష్టత లేదు.ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని రేడియేషన్ ప్రభావాలను ఎదుర్కొనేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా సేకరించింది.ఖచ్చితంగా జరుగుతుంది ,జరగదు అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.