మొత్తం ఎస్సీ జనాభాలో మాల మాదిగ కులాల జనాభానే 80 శాతం వరకూ ఉండొచ్చు.మిగతా 57 కులాల్లో పెద్ద సంఖ్య రెల్లి కులానిది.వీరు మూడు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎక్కువగా ఉంటారు.అయితే,ఈ కులాలన్నీ ఊరవతల వెలివాడలే ఆవాసం.సమాజంలో దారుణమైన అణచివేతను,అంటరానితనాన్ని,వివక్షనుఎదుర్కొన్నాయి…వర్గీకరణతో దళితుల్లో మరింత వెనుకబాటుకు,వివక్షకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన చెందుతున్న దళిత మేధావి ఎస్ ఆర్ వేమన విశ్లేషిసిస్తున్న వ్యాసం.
ఎస్సీలకు కేటాయించిన విద్య,ఉద్యోగాలలో ఎస్సీలు అందరూ దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని వర్గీకరణ అడ్డుకుంటుంది.నియంత్రిస్తున్నది.వర్గీకరణను.సామాజిక వివక్షతలో అతి దారుణమైనది అస్వృశ్యత.అస్వృశ్యత కారణంగా వెలివేతకు గురైన సామాజిక సమూహాలన్నింటిని భారత సమాజంలో మిగిలిన వారితో సమానంగా ఎదిగే అవకాశం కల్పించాలి.అందువలన వారందరిని ఒక షెడ్యూల్డ్ పొందుపరిచి “షెడ్యూల్డ్ క్యాస్ట్స్ పట్టికను రూపొందించి మిగిలిన సామాజిక సమూహాలతో సమానంగా విద్యా, ఉద్యోగాలు కల్పించే ఉద్దేశంతో రాజ్యాంగ పరచర్యలో భాగంగాఎస్సీ రిజర్వేషన్ లు రక్షణ కవచంగా రూపొందించబడినవి.అందువలన ఎస్సీ రిజర్వేషన్ లకు ఆంధ్రప్రదేశ్ లొ ఎస్సీలుగా పుట్టిన యోగ్యులైన వారు అందరూ అర్హులు అవుతారు.కానీ వర్గీకరణ వలన కొన్ని కొన్ని ఉద్యోగాలకు కొన్ని కొన్ని కులాలనే ఒక్కసారే అర్హతను కలిపిస్తుంది. ఈ విధానంలో ఆ గ్రూపులో రోస్టర్ ప్రకారం అర్హత కలిగినప్పటికి రెండోవసారి దరఖాస్తు చేసుకోవడానికి వయోపరిమితి దాటిపోయింది.సహజన్యాయ సూత్రాలకు వ్యతిరేకం.మాదిగ దండోరా ఆందోళనకు మద్దతు ఇస్తున్న నిజాయితీగల నిజమైన పౌర మేధావులా!.. పెద్ద అశాస్త్రీయ వర్గీకరణకు మద్దతుపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.కులవర్గీకరణ అవసరం లేకుండా ఇప్పుడున్న రిజర్వేషన్ విధానం యధాతధంగా కొనసాగిస్తూ ఎస్సీ 59 కులాలలో ఎటువంటి సౌకర్యాలు లేని గ్రామీణ ప్రాంతాల నుండి అరాకొర సౌకర్యాల ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్య ఉద్యోగ,ఉపాధి, ఆర్థిక, రాజకీయంగా, ఇతరత్రా సామాజిక కారణాలు వలన ఇంతవరకు బడి మెట్లు ఎక్కని సంతతికి చెందిన అట్టడుగున ఉన్న చిట్టచివరి వ్యక్తులకుఅత్యధిక ప్రాధాన్యత భావనతో పై 6 సామాజిక వెనుకబాటుతనాలకు ప్రాధాన్యత(social backwardness weightage marks (SBWM ) మార్కులు 1 నుండి 5 వరకు కేటాయిస్తూ ఎంపిక చేసే ఎంపిక విధానంతో ప్రతి లబ్ధిదారుడికి సంపూర్ణ సామాజిక న్యాయం చేకూర్చవచ్చు.
మందకృష్ణ అబద్దాల జోరు…
మాదిగ దండోరా ఎమ్మార్పీఎస్ ముందా కృష్ణ చెబుతున్నట్టుగావర్గీకరణలోసమన్యాయంలేదు.సామాజిక న్యాయం లేదు.మేము ఎంతో మాకు అంత లేదు. చివరికి సహజ న్యాయము లేదు.సమన్యాయం,సామాజిక న్యాయం, మేము ఎంతో మాకు అంత సహజ న్యాయము అంటూ మోసం చేస్తున్న ఎమ్మార్పీఎస్ తో గొంతు కలుపుతున్న వారు పౌర సమాజాన్ని అడ్డంగా మోసం చేస్తున్నట్టే.ఎస్సీలో పుట్టిన ప్రతి వారికి ప్రతి ఎస్సీ విద్యా, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే సహజ న్యాయ అవకాశాన్ని వర్గీకరణ అడ్డుకుంటుంది.
-ఎస్ ఆర్ వేమన
9494 48 4242
This is also read
కులగణన అనంతరం బీసీ రిజర్వేషన్లలో మార్పులు వస్తాయా?
ఆడపిల్లల తల రాతలు మార్చిన మహా మనిషి సావిత్రిబాయి పూలే
వర్గీకరణను ఎందుకు వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు: ఎస్ఆర్ వేమన