అట్టేపల్లి రామప్రభు ఆధ్వర్యంలో ఘనంగా మహిళాదినోత్సవ వేడుకలు..

విజేతలకు బహుమతులు అందజేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
విజేతలకు బహుమతులు అందజేస్తున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ 

శేరిలింగంపల్లి( విశాల జ్యోతి)
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మియాపూర్ డివిజన్ పరిధిలో అట్టేపల్లి లక్ష్మీనారాయణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చైర్మన్ అట్టేపల్లి రామప్రభు, పురుషోత్తం ఆధ్వర్యంలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గత 15 రోజులుగా మియాపూర్ పరిధిలోని వివిధ కాలనీలలో మహిళల కోసం వినోదాత్మక గేమ్స్ , ప్రతిభా పోటీలు నిర్వహించి మహిళలలోని ప్రతిభను వెలికితీయడానికి వివిధ రకాల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో గెలుపొందిన 24 మంది విజేతలకు మొత్తం 24 మొదటి బహుమతులు కింద ప్రతి ఒక్కరికీ రూ.5,000 విలువైన బహుమతి అందజేశారు.మరో 24 మంది ద్వితీయ స్థానంలో గెలుపొందిన విజేతలకు బహుమతులు రూ.3,000 చొప్పున్న అందజేశారు. అదనంగా పోటీల్లో పాల్గొన్న ఎనిమిది వందల మంది మహిళకు ప్రోత్సాహకంగా చీరలను పార్టిసిపేషన్ గిఫ్ట్‌లుగా అందజేసారు.మహిళ మహారాణి.. మహిళ సంకల్పిస్తే ఏదైనా సాధ్యం అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం మియాపూర్‌లోని ప్రగతి ఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యంత వైభవంగా జరిగింది. కార్యక్రమంలో బహుమతి ప్రదానోత్సవం, విందు కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఇదే సందర్భంగా మియాపూర్ ప్రాంత ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఉచిత అంబులెన్స్ సేవలను హైడ్రా కమిషనర్ రంగనాథ్  ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాణిజ్య పన్నుల శాఖ ప్రిన్సిపల్ కమిషనర్ కె మధుసూదన్,అర్జున అవార్డు గ్రహీత జీవంజీ దీప్తి, డాక్టర్ జె బి రావు మియాపూర్ ఎస్.ఐ వెంకటేష్, కిమ్స్ ఆసుపత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్య ప్రియ,మియాపూర్ జడ్పీహెచ్‌ఎస్ ప్రిన్సిపాల్ వసుంధర, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు చంద్రిక ప్రసాద్, బోయిని మహేష్ యాదవ్, నిమ్మల రామకృష్ణ గౌడ్,మోహన్ ముదిరాజ్,మువ్వ సత్యనారాయణ, పురుషోత్తం యాదవ్, ఓం ప్రకాష్, కృష్ణ పటేల్,డిఎస్ ఆర్ కె ప్రసాద్, బాబ్జి, సుధీర్,వినయ్ ముదిరాజ్, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు. ఏ ఆర్ పి టీం సబ్యులు, అట్టేపల్లి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.దాదాపు 1300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా అట్టేపల్లి రామప్రభు మాట్లాడుతూ, మహిళలు సమాజ అభివృద్ధికి పునాది, మహిళ సాధికారతే దేశ అభివృద్ధికి మార్గం అని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంటూ, పాల్గొన్న ప్రతి మహిళకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *