గోపన్‌పల్లిలో ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

విశాల జ్యోతి శేరిలింగంపల్లి

గోపన్‌పల్లి ఎన్‌టీఆర్ నగర్,తాజ్ నగర్  పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.శ్రీ విజయ గణపతి స్వామి వారి ధ్వజారోహణ ప్రత్యేక పూజలు  నిర్వహించారు. రాజు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాలలో ఎమ్మెల్సీ రాములు నాయక్,టిపిసిసి ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు జెర్రీపేటి జైపాల్,గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా,సురేందర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.మూడు రోజుల పాటు స్వామివారి ఉత్సవాలులో భాగంగా చివరి రోజు ఆదివారం పూజ కార్యక్రమాలతో పాటు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.స్వామివారికి ప్రాణప్రతిష్ఠ అనంతరం మహా అన్నప్రసాద వితరణ నిర్వహించారు.

పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా

.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *