
విశాల జ్యోతి శేరిలింగంపల్లి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ నిర్వహించిన ఈ సంబరాలకు కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వేడుకల్లో సందడి చేశారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు. పూలతో అలంకరించిన బతుకమ్మల మధ్య పండుగ వాతావరణం నెలకొంది.వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన మహిళలకు కల్వకుంట్ల కవిత స్వయంగా బహుమతులు అందజేశారు. మహిళల్లో ఉత్సాహాన్ని నింపుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ పేర్కొన్నారు
.