పిల్లల భాగస్వామ్యంతో మొక్కలు నాటిన ఆకృతి హోమ్స్ అసోసియేషన్ సభ్యులు

కుత్బుల్లాపూర్ : విశాల జ్యోతి

కుత్బుల్లాపూర్ బీరప్పనగర్ కాలనీలో ఆకృతి హోమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఆకృతి హోమ్స్ రెసిడెంట్స్ అసోసియేషన్, బీరప్ప నగర్, ఆకృతి హోమ్స్ అసోసియేషన్అధ్యక్షులు ఉరుకొండ వెంకటేశ్వర రావు,కమిటీ సభ్యులు క్యాసారం బస్వరాజ్,చిల్ల రేవతి, పున్నాన హిమ, నరసింహ, ప్రతాప్ రెడ్డి,మురళి,హిమ,ఇందిర, సౌమ్యపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు చిన్నారులను కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములను చేశారు. మంచి పని చేయడం ఎంత ముఖ్యమో, ఆ మంచి పనిలో పిల్లలను భాగస్వాములను చేయడం అంతకంటే ముఖ్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.నేటి బాలలే రేపటి పౌరులు అన్న భావనతో చిన్నారులకు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బస్వరాజ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలు ప్రతిబింబించేలా చిన్నారులను తీర్చేందుకు కృషి చేయాలని కోరారు.మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం అత్యంత బాధ్యతగా భావించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పెద్దలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *