ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన మహిత, యువన్

వైద్య విద్యలో దళిత యువత ముందడుగు

కాబోయే ఇద్దరు డాక్టర్లు అంటూ ప్రశంసలు

మందస   షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం నేతల అభినందనలు

పలాస: విశాల జ్యోతి 

వైద్య విద్యలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన మహిత, యువన్‌లకు దళిత సంఘాల  నేతలు అభినందనలు తెలిపారు. ఉన్నత విద్యలో ప్రతిభను చాటుతూ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఏపీ ఎన్జీవోస్, గ్రీన్ ఆర్మీ అధ్యక్షుడు బోనెల గోపాల్ కుమార్తె మహిత విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు. అదేవిధంగా జీడిపాల వధనగిరి, పద్మావతి దంపతుల కుమారుడు యువన్ ఏలూరులోని అల్లూరి సీతారామరాజు ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించారు.ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు ఇరువురిని అభినందించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. మహిత, యువన్‌లు కాబోయే ఇద్దరు డాక్టర్లుగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివి వైద్య విద్యలో సీట్లు సాధించడం అభినందనీయమని పేర్కొన్నారు.దళిత వర్గాలకు చెందిన యువత విద్య, వైద్యం, పరిపాలన, ఉద్యోగ, వృత్తిపరమైన రంగాల్లో ఉన్నత స్థానాలు సాధించాలని కోరారు. ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేసే కీలకమైన వృత్తుల్లో దళిత యువత ప్రాతినిధ్యం పెరగడం ద్వారా విద్య, సామాజిక అభివృద్ధి, సమాన అవకాశాలపై మరింత అవగాహన ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మహిత, యువన్‌ల విజయాలు ఇతర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాలని, భవిష్యత్తులో వైద్య రంగంలో ఉన్నత స్థానాలను అధిరోహించి పేదలు,బలహీన వర్గాలకు సేవలందించాలని వారు ఆకాంక్షించారు.విద్యే అభివృద్ధికి బాట.. ప్రతిభే విజయానికి ఆయుధం అనే సందేశంతో యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని ముందుకు సాగాలని దళిత సంఘాల ఐక్యవేదిక నేతలు పిలుపునిచ్చారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *