
శేరిలింగంపల్లి:రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికలల్లో 241డివిజన్ మక్త మహబూబ్ పేట బీఆర్‌ఎస్ పార్టీ తరఫున కార్పొరేటర్ టికెట్ ఆశిస్తున్న పలువురు నాయకులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.అందులో కాసాని శ్రీధర్ ముదిరాజ్ పేరు స్థానిక రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.మక్తా–మహబూబ్‌పట్నం ప్రాంతంలో ప్రజలతో శ్రీధర్‌కు ఉన్న సన్నిహిత సంబంధాలు, యువతతో ఏర్పడిన అనుబంధం, స్థానిక సమస్యలపై స్పందించే తీరు ఆయన అభ్యర్థిత్వానికి బలంగా మారుతున్నాయని ఆయన అనుచరులు చెబుతున్నారు. వివిధ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండటం కూడా ఆయనకు కలిసొచ్చే అంశంగా పేర్కొంటున్నారు.
రాజకీయ నేపథ్యం
కాసాని శ్రీధర్ ముదిరాజ్ కుటుంబానికి రాజకీయ, సామాజిక సేవా నేపథ్యం ఉందని ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. ఆయన తండ్రి కాసాని రామాంజనేయులు గతంలో ఉపసర్పంచ్‌గా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.ఆయన కుటుంబానికి ఉన్న రాజకీయ అనుభవంతో పాటు స్థానికంగా ప్రజలతో ఏర్పడిన వ్యక్తిగత సంబంధాలు శ్రీధర్ రాజకీయ ప్రయాణానికి అనుకూలంగా మారే అవకాశముందని స్థానిక రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.డివిజన్–241లో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, స్థానికంగా నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారం, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర ప్రజా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని పేరు ఉంది.పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయిస్తే ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో విజయం సాధించి డివిజన్ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని వారు పేర్కొంటున్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం, వారి సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడమే శ్రీధర్ లక్ష్యమని అనుచరులు చెబుతున్నారు.
అధిష్ఠానం నిర్ణయంపై ఉత్కంఠ
డివిజన్–241లో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ టికెట్ కోసం పలువురు ఆశావహులు ప్రయత్నాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కాసాని శ్రీధర్ ముదిరాజ్ పేరు ముందువరుసలో వినిపిస్తుండటం స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై స్థానిక పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతుండగా, అధిష్ఠానం తీసుకునే నిర్ణయం డివిజన్–241లో భవిష్యత్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని స్థానిక రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.