హైదరాబాద్ గచ్చిబౌలిలో కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. శ్రీరామ్ నగర్ కాలని సి బ్లాక్ లో సరిత శ్రీరామ్ ఎన్క్లేవ్ లోని తన అపార్ట్మెంట్ లో ఫ్యాన్ కు ఊరివేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో పక్క గదిలోనే భర్త సుధీర్ రెడ్డి నిద్రపోతున్నారు. ఈ ఉదయం 8 గంటల ప్రాంతంలో పనిమనిషి ఇంటికి రావడంతో ఆత్మహత్య విషయం వెలుగులోకి వచ్చింది. సోబిత గది తలుపు తీయకపోవడంతో అనుమానంతో తలుపు పగలగొట్టి చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. భర్త సుధీర్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.. తన భర్త సుధీర్ తో కలిసి శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. పెళ్లి తర్వాతహైదరాబాద్ ఉంటున్నారు. శోభిత. సీరియల్స్ మాత్రమే కాకుండా తెలుగులో ఫస్ట్ డే ఫస్ట్ షో అనే సినిమాలో నటించింది. శోభిత సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం అనంతరం ఆమె మృతదేహాన్ని బెంగుళూరు తరలించనున్నట్లు సమాచారం.
బ్రహ్మగంతు,నినిదలే సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించిన శోభిత.కర్ణాటక లోని సక్లేష్ పూర్. శోబిత బెంగళూరులో సుధీర్ జాబ్ చేస్తున్న సమయంలోనే మాట్రిమోనీ ద్వారా వివాహం చేసుకున్నారు అప్పటినుంచి శోభిత హైదరాబాదులో ఉంటూ పలు సిని సీరియల్స్ లో నటిస్తున్నారు.శోభిత తన గదిలో ఈ తెల్లవారుజామున ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ సమయంలో తన గదిలో ఆధ్యాత్మిక పాటలు రన్ అవుతున్నాయి. అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడితే ఉదయం ఎనిమిది గంటలకు పనిమనిషి రాకతో వెలుగు చూసింది. భార్యాభర్తల మధ్య పెద్ద ఎత్తున తగాదాలు ఏమీ లేవని చిన్న చిన్న పొరపొచ్చాలుఉంటే ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు.సుధీర్ రెడ్డి హైదరాబాదులో ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు. శోభిత ఆత్మహత్యఘటనపై సుధీర్ రెడ్డి పోలీసులకు సమాచారం అందించారు.
శోభిత ఆత్మహత్యకుల కారణాలేమిటి
బ్రహ్మగంటు పేరు మోసిన సీరియల్ లో నటిస్తూ కన్నడలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న శోభిత ఆత్మహత్య వ్యవహారం అక్కడ సినీ రంగంలో తీవ్ర దిగ్భాంతికి గురి చేసింది. శోభిత మరణ వార్త అక్కడ మీడియా ప్రముఖంగా ప్రచురించారు. శోభిత తన సోషల్ మీడియా అకౌంట్లో ఎక్కడ భర్త తో ఉన్నట్లు కనబడలేదు చిన్న వయసులోనే సినీ, బుల్లితెర రంగంలో ఆదరణ సంపాదించుకున్న శోభిత ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది.