రసాయనాలు చల్లి అధికంగా డబ్బు తయారీ. బాక్స్ నిండా డబ్బే.

 

నకిలీ కరెన్సీ రెట్టింపు పేరుతో రూ.20 లక్షల మోసం

ప్రమాదకరమైన రసాయనలతో మాయ

మసిపూసి మారేడు కాయ చేస్తున్న విదేశీయులు

ఇలా మోసం చేయడం తమ వ్యాపారం అంటూన్న విదేశీయులు

అధిక డబ్బు కోసం అత్యాశ మోసగాళ్లకు అస్త్రంగా మారుతుందా

 

విశాల జ్యోతి శేరిలింగంపల్లి

నకిలీ కరెన్సీని రసాయనాల సహాయంతో రెట్టింపు చేస్తామని నమ్మించి రూ.20 లక్షలు కాజేసిన అంతర్రాష్ట్ర మోసగాళ్ల ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు విదేశీయులను అరెస్టు చేశారు.జూలై 20న వ్యాపారవేత్త శ్రీ కృష్ణ కాంత్ వడ్లానినీ వ్యాపారవేత్తలుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ముందుగా నల్లని కాగితాలను రసాయనాలతో ప్రాసెస్ చేసి కరెన్సీ నోట్లుగా మార్చినట్లు మాయాజాలం చేశారు రూ.20 లక్షల నగదును ఒక పెట్టెలో ఉంచించి, ప్రత్యేక రసాయనం తీసుకొచ్చే వరకు పెట్టెను తెరవవద్దని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొంతసేపటి తర్వాత పెట్టెను తెరిచి చూడగా నగదుకు బదులుగా తెల్ల కాగితాలు, రంగుల ఫోటోకాపీ షీట్లు మాత్రమే ఉండటంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టూరే ఎల్ హాడ్జీ మహమనే @ ఫోకౌ టమెన్ రోమువాల్డ్ అలియాస్ రోలిన్ (49), ట్చువాన్యు అడాల్ఫ్ అలియాస్ ఔరామ్ (62) న్యూఢిల్లీ వసంత్ కుంజ్‌లో నివాసం ఉంటున్న వీరు కామెరూన్, మాలి దేశాలకు చెందినవారు.కాగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈ తరహా మోసాలకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.ఇలా మోసం చేయడం తమ బిజినెస్ గా చెప్పుకుంటున్నారు కేటుగాళ్లు.

మోసం ఎలా చేస్తారంటే…

కరెన్సీ నోట్లను తయారు చేయడానికి ఉపయోగించే ఆక్టివేషన్ పౌడర్ (SSD Activation Powder / Humine Powder) తో ముడిపడి ఉన్న లావాదేవీలు పూర్తిగా మోసపూరితమైనవి అంతర్జాతీయ చట్టాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఇటువంటి రసాయనాలను ఉపయోగించి నోట్లను క్లీన్ చేయడం లేదా మార్చడం తీవ్రమైన నేరం.ఈ రసాయన ప్రక్రియ వెనుక ఉన్న నిజాలు ఇలా ఉన్నాయి.మోసగాళ్లు సాధారణ కాగితాలపై నల్లటి రంగును పూసి, అవి విదేశాల నుండి వచ్చిన అసలు డాలర్లు లేదా కరెన్సీ నోట్లు అని నమ్మిస్తారు.మీ ముందే ఒక కెమికల్ (SSD Solution) ఆక్టివేషన్ పౌడర్ ఉపయోగించి, ఆ నల్లటి కోటింగ్‌ను తొలగించి ఒకటి లేదా రెండు అసలు నోట్లను క్లీన్ చేసి చూపిస్తారు. అప్పటికే వారి వద్ద సిద్ధంగా ఉన్న నోట్లు అవి.మిగిలిన నోట్లను కూడా క్లీన్ చేయడానికి ఈ ఆక్టివేషన్ పౌడర్ చాలా ఖరీదైనదని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసి ఆ తర్వాత పరారవుతారు.కరెన్సీ నోట్లను రసాయనాలతో మార్చడం లేదా నకిలీ నోట్ల ముద్రణకు ప్రయత్నించడం చట్టరీత్యా శిక్షార్హమైన నేరం. ఇందుకోసం వినియోగిస్తున్న రసాయనాలు, పౌడర్లు చర్మానికి, శ్వాసకోశ వ్యవస్థకు తీవ్రమైన హాని కలిగిస్తాయి.ఇలాంటి ఆక్టివేషన్ పౌడర్ల పేరుతో జరిగే వ్యాపారాలు 100% నకిలీవి. వీటిని నమ్మి డబ్బు పెట్టుబడి పెడితే పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది.భారతదేశంలో అధికారికంగా నోట్లను ముద్రించే హక్కు కేవలం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి మాత్రమే ఉంది.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *