అగ్నివన్నియకుల క్షత్రియ జాతిపిత పొన్నమండ 157వ జయంతి వేడుకలు

అగ్నికుల క్షత్రియ సమూహాన్ని ఒకే వేదికపై తీసుకురావడంలో ఎనలేని కృషి. 

వివిధ సమూహాలుగా ఉన్న సంఘాన్ని ఒకే గొడుగు కిందకు వచ్చేందుకు 1901లో బీజం 

అగ్నివన్నియకుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 157వ జయంతి వేడుకలలో వక్తల కీలక ప్రసంగం


అగ్నివన్నియకుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ 157వ జయంతి వేడుకలటిను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు,ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొడ్డు కోదండరావు, కార్యదర్శి జల్లా మల్లికార్జున్, కోశాధికారి డీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియ సంఘం చైతన్యం తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారని తెలిపారు.ముఖ్య అతిథులుగా డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు రామకృష్ణ, రామారావు హాజరయ్యారు.ఎస్సై లక్ష్మణ్ బాబు, గౌరవ అధ్యక్షులు టీవీ రావు,కోదండ కృష్ణ,శాంతారావు, జైచందర్ తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా వక్తలు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జాతి అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు. సమాజంలో ఐక్యత, విద్య,సామాజిక చైతన్యం,అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు.జాతిపిత ఆశయాలను కొనసాగిస్తూ అగ్నికుల క్షత్రియుల సంక్షేమం, విద్యాభివృద్ధి,సామాజిక ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన సేవలు, ఆదర్శాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.ప్రముఖ సామాజిక నాయకుడు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ ప్రజలను సంఘటితం చేయడం, వారికి ప్రత్యేక సామాజిక గుర్తింపు తీసుకురావడం, విద్యా–సామాజిక అభ్యున్నతికి కృషి చేశారు. స్వస్థలం కోరంగి ప్రాంతం కాగా అప్పట్లో తీరప్రాంత వాణిజ్య కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా ఉండేది. సామాజిక, ఆర్థిక వాతావరణంలో పెరిగిన లక్ష్మణస్వామి వర్మలో చిన్ననాటి నుంచే సమాజం పట్ల బాధ్యత, సేవా భావం ఉంది. అప్పట్లో అగ్నికుల క్షత్రియ సమాజానికి చెందిన ప్రజలు వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో నివసించేవారు. ఈ విభిన్న గుర్తింపులు కుల ఐక్యతకు అడ్డంకిగా మారుతున్నాయని భావించిన లక్ష్మణస్వామి వర్మ, ప్రజలను ఒకే సామాజిక వేదికపైకి తీసుకురావాల్సిన అవసరాన్ని గుర్తించారు. విద్య, ఐక్యత, ఆత్మగౌరవం, సంఘటిత శక్తి అవసరమని 1901లోనే ప్రారంభించారు. ఈ నిర్ణయం కీలకమైన మలుపుగా కోరంగిలో అగ్నికుల క్షత్రియ సంఘం ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. సంఘం ద్వారా ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడం, వారి సమస్యలను చర్చించడం, సామాజిక అభివృద్ధి కోసం కృషి చేశారు.వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో ఉన్న సమూహాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావడంలో ఎనలేని కృషి చేశారు. ఆర్థిక బలం తో పాటు, విద్య, సంఘటిత శక్తి అవసరమని గుర్తించారు.విద్య,ఐక్యత ,ఆత్మగౌరవం సామాజిక అభివృద్ధి,సంఘటిత శక్తి ప్రాధాన్యత గుర్తించారు.ఈ విలువలు విస్తృతం చేసేందుకు ఆయన చేసిన ప్రయత్నాలే తరువాతి తరాలకు స్ఫూర్తిగా స్ఫూర్తిదాయకం అయ్యాయి.సత్యశీలత, ఓర్పు, పట్టుదల, దయ, ధైర్యం, విధినిర్వహణ, సంఘసేవ వంటి లక్షణాలకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడిగా గుర్తింపు పొందారు.వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుందని కష్టం చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు, ప్రముఖులు, సభ్యులు పాల్గొని జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మకు ఘన నివాళులు అర్పించారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *