ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ బ్రాండ్ ‘హబీబ్స్ నూతన ప్రీమియం సెలూన్ బాచుపల్లి ప్రారంభం

 

బాచుపల్లి లో నటీ వర్ష  చేతుల మీదుగా సెలూన్ ప్రారంభం

ప్రముఖ హెయిర్ అండ్ బ్యూటీ బ్రాండ్ ‘హబీబ్స్ నూతన ప్రీమియం సెలూన్ శాఖ హైదరాబాద్‌లోని బాచుపల్లి మియాపూర్ రోడ్‌లో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బాచుపల్లి లహరి ట్విన్స్ గ్రౌండ్ ఫ్లోర్‌లో (రత్నదీప్ సూపర్ మార్కెట్ సమీపంలో, కేఎస్ బేకర్స్ పక్కన) ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక సెలూన్‌ను ముఖ్య అతిథి, ప్రముఖ సినీ, టెలివిజన్ నటి వర్ష (Varsha) రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.హబీబ్స్ ప్రతినిధి ఎండీ అమన్ హబీబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.​ఈ సందర్భంగా ముఖ్య అతిథి నటి వర్ష మాట్లాడుతూ… అంతర్జాతీయ ప్రమాణాలతో, సరికొత్త ట్రెండ్స్‌కు అనుగుణంగా బాచుపల్లి పరిసర ప్రాంతాల ప్రజల కోసం హబీబ్స్ తమ ప్రీమియం సెలూన్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అనుభవజ్ఞులైన హెయిర్ స్టైలిస్టులు, బ్యూటీషియన్లతో నాణ్యమైన సేవలు అందించడానికి ఈ బ్రాండ్ ఎప్పుడూ ముందుంటుందని కొనియాడారు.హబీబ్స్’ బాచుపల్లి బ్రాంచీ నిర్వ‌హ‌కులు నాసిర్, మునాజిర్ ఖాన్ ముఖ్య అతిథుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. తాము అందించే సేవ‌ల వివ‌రాలు తెలిపారు. హబీబ్స్’ ఎండీ అమన్ హబీబ్ మాట్లాడుతూ… కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, బ్యూటీ అండ్ హెయిర్ కేర్ రంగంలో సరికొత్త సాంకేతికతను, అత్యుత్తమ సేవలను బాచుపల్లి బ్రాంచ్‌లో అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు,పురుషులు ఇరువురికి నచ్చేలా అధునాతనమైన ఇంటీరియర్స్‌తో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ప్రీమియం సెలూన్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు.నిర్వాహకులు ప్రశాంత్ లడ్డా, శ్రీకాంత్ రాఠీ మాట్లాడుతూ, వినియోగదారులకు స‌ర‌స‌మైన ధరలకే అత్యున్నత స్థాయి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.​అట్టహాసంగా జరిగిన ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు, కస్టమర్లకు నిర్వాహకులు నాసిర్, మునాజిర్ ఖాన్ కృతజ్ఞతలు తెలిపారు.

Also read this

చందానగర్ లో హాబీబ్స్ న్యూ ప్రీమియం సెలూన్ ప్రారంభించిన సినీనటి హిమజ

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *