సెంట్రింగ్ కార్మికులు సమ్మె విరమించకపోతే అంతే సంగతులు

సెంట్రింగ్ కార్మికులు సమ్మె విరమించేలా ప్రభుత్వం చొరవ చూపాలి

సెంట్రింగ్ ధరలు పెంచకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి

బిల్డర్ నుంచి వసూలు చేస్తున్న లేబర్ సెస్ కార్మిక సంక్షేమానికి వినియోగించాలి

మిరియాల రాఘవరావు

 

విశాల జ్యోతి శేరిలింగంపల్లి
సెంట్రింగ్ కార్మికుల సమ్మె కారణంగా నిర్వాణరంగం కుదేలు అయిందని, ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ చైర్మన్ మిరియాల రాఘవరావు కోరారు.గ్రేటర్ వెస్ట్ సిటీ బిల్డర్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూసెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె కారణంగా నిర్మాణ రంగంలో స్తబ్దత నెలకొందని చెప్పారు.సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు.ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా సెంట్రింగ్ రేట్లు పెంచమనడం సమంజసం కాదని అన్నారు.నిర్మాణ సామాగ్రి ధరలు పెరిగి తీవ్ర సంక్షోభంలో ఉన్న బిల్డర్లకు అదనపు భారం పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.నిర్మాణ సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని సెంట్రింగ్ కాంట్రాక్టర్లు సమ్మె విరమించాలని కోరారు.యుద్దాల కారణంగా పెరుగుతున్న మెటీరియల్ ధరలు నిర్మాణదారులను సంక్షోభంలోకి నెట్టేస్తుండగా ఈ సమ్మె కారణంగా చిన్న బిల్డర్స్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది.మార్కెట్లో నెలకొన్న స్తబ్దత కారణంగా చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్టుగా వాపోయారు.ప్రభుత్వం మార్కెట్ ధరలు పెంచడానికి చేస్తున్న ప్రయత్నాలు విరమించుకోవాలన్నారు. దీంతో ఏర్పడే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.ఎస్ ఎఫ్.టి రేట్లు పరిగణలోకి తీసుకోకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మార్కెట్ పరిస్థితి అద్వానంగా ఉందని, బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ట్రాన్స్ఫార్మర్స్ పొందడంలో సమస్యలు ఎదురవుతున్నయి. దాని కారణంగా కస్టమర్ల వెనక్కి వెళ్లిపోయే పరిస్థితి నెలకొందన్నారు.జరుగుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము ట్రాన్స్ఫార్మర్లు ఆక్యుపెన్సి సర్టిఫికెట్ తో ముడి పెట్టకుండా మంజూరు చేసే విధంగా చూడాలని కోరారు.రిజిస్ట్రేషన్ చార్జెస్ పర్సంటేజ్ ని గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తగ్గించినట్లుగా, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా తగ్గించి కస్టమర్స్ కు చేయూతను అందించాలని కోరారు.ప్రభుత్వం బిల్డింగ్ పర్మిషన్ టైం లో కలెక్ట్ చేస్తున్న లేబర్ సెస్ సెంట్రింగ్ కాంట్రాక్ట కార్మికుల సంక్షేమానికి వినియోగించాలన్నారు.నిత్యావసర ధరలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, సెంట్రింగ్ మెటీరియల్ కోసం రూ.5 లక్షల బ్యాంకు సబ్సిడీ రుణాలు,బీమా సౌకర్యం,కార్మికులకు ఉచిత శిక్షణ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయింపు తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుభూతితో కార్మికులకు ఆదుకోవాలన్నారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *