
నానక్ రామ్ గూడా రామానాయుడు స్టూడియోకు వెళ్లే దారిలో ఉన్న బంగారం కట్ట మైసమ్మ దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రతి అమావాస్య నాడు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం మంగళవారం కూడా కొనసాగింది. 51వ అమావాస్య అన్నదాన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వందల మంది భక్తులు హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డి అనిల్ కుమార్, ఎస్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ మహిమగల కట్ట మైసమ్మ అమ్మవారు భక్తుల కోరిన కోరికలు నెరవేర్చే తల్లిగా కొనియాడబడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కష్టాలు తీర్చే కల్పవల్లి బంగారు మైసమ్మ ఈ ఏడాది వర్షాలు విరివిగా కురిసేలా ఆజ్ఞ ఇవ్వాలని కోరారు.వర్షం లేక అన్నదాత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కట్ట మైసమ్మ తన చల్లని చూపు ప్రజలపై ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి శ్యామ్, ఎస్ మహేందర్, చంద్రశేఖర్, విష్ణు డి కేశవ్, జలంధర్, బబ్లు, లోకేష్ ,గండయ్య , ఎస్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి