ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియామకం

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియామకం

ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ (AIOBCSA) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా యాచారం గణేష్ గౌడ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా యాచారం గణేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులు గౌడ కిరణ్ కుమార్, జాతీయ కమిటీ సభ్యులు, ఉస్మానియా కమిటీ సభ్యులు, రాష్ట్ర నాయకత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా ఓబీసీ విద్యార్థుల హక్కుల పరిరక్షణ,విద్యా,ఉపాధి అవకాశాల విస్తరణ,సామాజిక న్యాయం,రాజ్యాంగబద్ధమైన హక్కుల అమలు కోసం నిరంతరం పోరాడతామని ఆయన పేర్కొన్నారు.తెలంగాణలోని ప్రతి జిల్లా,మండలం,కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయిలో ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్‌ను మరింత బలోపేతం చేసి, ఓబీసీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.ఓబీసీ విద్యార్థులు ఐక్యంగా సంఘంతో కలిసి ముందుకు వచ్చి విద్య, ఉపాధి, సామాజిక న్యాయం కోసం జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

Share This Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *