హైటెక్ సిటీ ముంపుకు కారణాల అన్వేషించాలి
ప్రతి వ్యక్తి ఓటరూగా నమోదు చేసుకోవాలి
చందానగర్ పిజిఆర్ స్టేడియం సమీపంలో టిఆర్ఎస్ పార్టీ పతాకావిష్కరణ
వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్

విశాల జ్యోతి శేరిలింగంపల్లి
చిన్నపాటి వర్షాలకే హైటెక్ సిటీ ముంపుకు గురవుతున్న కారణాలు అన్వేషించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోందని తెలంగాణ రక్షణ సేన (టిఆర్ఎస్) పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇన్చార్జ్ వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రణాళిక బద్ధంగా నగర నిర్మాణం,వర్షం నీరు పోయే దారులన్నీ పునరుద్ధరించడం, జల వనరుల విధ్వంసం జరగకుండా చూడాలని కోరారు.తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.ఇందులో భాగంగా చందానగర్ పి జె ఆర్ స్టేడియం సమీపంలో వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ ఐ ఆర్ కార్యక్రమం విజయవంతం కావాలంటే ప్రతి ఓటరు తమ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా గుర్తించి తాను తనతో పాటు ఉన్న బస్తీ వాసులందరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు చొరవ చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ అస్లాం,విష్ణుచారీ,మురుగేసాన్,దయానంద్,లక్ష్మి, మాదవి,సందీప్, ప్రవీణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.