భారతదేశంలోని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బయోటెక్నాలజీ సంస్థ బైకస్ థెరప్యూటిక్స్ కీలక ముందడుగు వేసింది., ఈ ప్రాంతంలో బయోఫార్మాస్యూటికల్ పరిశోధన, తయారీ ఆవిష్కరణలను అభివృద్ధి చేసే అవకాశాలను అన్వేషించడానికి మలేషియాకు చెందిన పెనాంగ్ స్టెమ్ ఎస్డిఎన్. బిహెచ్డి (పిఎస్ఎస్బి)తో వ్యూహాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. పెనాంగ్‌లో బయోలాజిక్స్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రపంచ మార్కెట్ల కోసం అధిక నాణ్యత, సరసమైన బయోసిమిలార్లు బయోలాజిక్స్ అభివృద్ధికి చేయడానికి దోహదపడుతుంది. అభివృద్ధి చెందిన మార్కెట్లలో అధునాతన చికిత్సల లభ్యతను విస్తరించడంపై దృష్టి సారించారు
ఆంకాలజీ, ఇమ్యునాలజీ, రుమటాలజీ , డయాబెటాలజీ రంగాలలో వైద్య అవసరాలను తీర్చడానికి బైకస్ సంస్థ బయోలాజిక్స్ బయోసిమిలార్లను అభివృద్ధి చేయడంలో చురుకుగా పనిచేస్తుంది.ఈ సందర్భంగా బైకస్ థెరప్యూటిక్స్ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వర రావు పులిపాటి మాట్లాడుతూ ఈ ఒప్పందం ప్రపంచ వృద్ధి వ్యూహంలో ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. అలాగే ఆవిష్కరణలు, శాస్త్రీయ నైపుణ్యం ,ఆరోగ్య సంరక్షణ లభ్యతను వేగవంతం చేసేందుకు అంతర్జాతీయ భాగస్వామ్యాలను కోరుకుంటున్నట్లు ఇది తమ నిబద్ధతకు నిదర్శనమని అభివర్ణించారు.పరిశ్రమలు, విద్యా సంస్థలు ప్రభుత్వం మధ్య పరస్పరం సహకారం అందించాలని కోరారు.మలేషియాలోని పెనాంగ్ ప్రాంతంలో బయోటెక్నాలజీ సామర్థ్యాలను నిర్మించడంలో పరిశోధన, ప్రతిభ అభివృద్ధి, ఆర్థిక వృద్ధికి స్థిరమైన అవకాశాలను సృష్టించడంలో దోహద పడుతుందని వివరించారు.ఈ రంగంలో పరివర్తనాత్మక పాత్ర పోషించగలవని మలేషియా పెనాంగ్ ఉప ముఖ్యమంత్రి జగ్దీప్ సింగ్ డియో అన్నారు.