
ప్రసిద్ద సైన్స్ పుస్తకాల తెలుగు అనువాదంపై ఐదు రోజుల కార్యశాల గచ్చిబౌలిలోని కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించారు.అనువర్తిత భాషా అధ్యయన అనువాద విభాగం (CALTS), హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రసిద్ధ సైన్స్ పుస్తకాల తెలుగు అనువాదంపై ఐదు రోజుల కార్యశాల నిర్వహిస్తోంది. ఈ కార్యశాల మైసూరులోని జాతీయ అనువాద సమితి సహకారం అందించింది. ఈ కార్యశాల మే 18న నుంచి 22వ తేదీ వరకు కొనసాగుతుంది.CSIR-
NIScPR ప్రసిద్ద సైన్స్ పుస్తకాల తెలుగు అనువాదాలను సమీక్షించడం మూల్యాంకన చేయడం ఈ కార్యశాల ముఖ్య ఉద్దేశ్యం. వీటిని భారతీయ భాషల కేంద్ర సంస్థ (CIIL) ప్రచురించనుంది. ప్రచురణ అనంతరం, ఈ పుస్తకాలు తెలుగు పాఠకులకు అందుబాటులోకి వస్తాయి. CALTS ప్రొఫెసర్ ఆచార్య అన్నం నరేష్ మాట్లాడుతూ… ప్రసిద్ద సైన్స్ పుస్తకాలను తెలుగులోకి అనువదించడం యొక్క ప్రాముఖ్యతను, తెలుగు పాఠకులకు ఈ పుస్తకాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. శాస్త్రీయ, సాంకేతిక భావనలను మాతృభాషలో నేర్చుకోవడం వల్ల స్పష్టత, మెరుగైన అవగాహన లభిస్తాయని, ఇదే అంశాన్ని జాతీయ విద్యా విధానం 2020 కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. విభాగ అధ్యక్షులు ప్రొఫెసర్ అరుల్మొళి మాట్లాడుతూ… తమ విభాగం గత మూడు దశాబ్దాలుగా అనువాద కార్యక్రమాలలో పాలుపంచుకుంటోందని, భారతీయ భాషలలో యంత్ర సహాయక అనువాద ప్రక్రియకు గణనీయమైన సహకారం అందించిందని చెప్పారు. జాతీయ అనువాద సమితి (NTM) ముఖ్య శిక్షకులు డాక్టర్ పి. మాథ్యూ మాట్లాడుతూ… NTM జ్ఞాన గ్రంథాలను, ప్రజాదరణ పొందిన సైన్స్ పుస్తకాలను 22 షెడ్యూల్డ్ భాషల్లోకి అనువదింపజేస్తోందని తెలిపారు. ఈ కార్యశాలలో అనువాద ప్రతులను సమీక్షించి, తుది రూపం ఇవ్వడానికి వివిధ ప్రాంతాల నుండి భాషా, అనువాద విషయ పరిజ్ఞాన నిపుణులు పాల్గొన్నారు.