
మందస మండలం లోహరిబంద గ్రామానికి చెందిన తెప్ప వికాస్ సైనింగ్ స్టార్ అవార్డు దక్కించుకున్నారు. లోహరిబంధ ప్రభుత్వ పాఠశాలలో 600 మార్కులకు గాను 567 మార్కులు సాధించి స్కూలు టాపర్ గా నిలిచాడు. అత్యధిక మార్కులు సాధించిన తెప్ప వికాస్ కు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఇన్చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా అత్యుత్తమ ప్రతిభా అవార్డు దక్కించుకున్నారు. ప్రశంస పత్రం తో పాటు 20 వేల నగదు బహుమతి లభించింది. విజయవాడ సమీపంలోని నిమ్మకూరు ఏపీఆర్జేసీ కళాశాలలో ఎంపీసీ విభాగంలో సీటు దక్కించుకున్నాడు. అత్యుత్తమ ఐఐటి యూనివర్సిటీలో సీటు సాధించడమే తన లక్ష్యమని వికాస్ తెలిపారు. ఇందుకోసం ఐఐటి సాధన కోసం తీవ్రంగా ప్రణాళిక బద్ధంగా కృషి చేస్తానని, ఐఐటి సాధించడమే తన ప్రథమ లక్ష్యమని తెలిపారు. అత్యధిక మార్కులు సాధించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు గైడెన్స్ ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఇందులో ఉపాధ్యాయుల సహకారం ఎంతో ఉందని వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తల్లిదండ్రులు పార్వతి, కూర్మా రావు తోడ్పాటు, మిత్రుల సహకారం ఉందన్నారు. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుమారుడు వికాస్ రైసింగ్ స్టార్ అవార్డు దక్కించుకన్నందుకు తల్లి పార్వతి సంతోషం వ్యక్తం చేశారు. రికగ్నైజింగ్ టాలెంట్ ఇన్స్పైరింగ్ టుమారో, సెలబ్రేటింగ్ బ్రైట్ మైండ్ బిల్డింగ్ ఏ బెటర్ టుమారో ఆంధ్ర ప్రదేశ్ అని పేర్కొంటూ ప్రశంస పత్రాన్ని అందజేశారు.